ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కేసుల వివరాలివ్వడానికి ఎంత సమయం కావాలి: హైకోర్టు - Cases on Political Leaders

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 13, 2024, 7:06 AM IST

Cases on Political Leaders: వివిధ ఠాణాల్లో తమపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలంటూ ఎన్నికల్లో పోటీ చేసే పలువురు అభ్యర్థులు చేసిన విజ్ఞప్తిపై పోలీసులు స్పందించకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. వివరాలు ఇవ్వాలనుకుంటే ఒక్కరోజులో అందజేయవచ్చని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈ వివరాలను అందజేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టంచేసింది.

Cases on Political Leaders
Cases on Political Leaders

కేసుల వివరాలివ్వడానికి ఎంత సమయం కావాలి: హైకోర్టు

Cases on Political Leaders: రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీసుస్టేషన్లలో తమపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలంటూ ఎన్నికల్లో పోటీ చేసే పలువురు అభ్యర్థులు చేసిన విజ్ఞప్తి విషయంలో పోలీసులు స్పందించకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నెల రోజుల కిందట పిటిషనర్లు డీజీపీకి విజ్ఞప్తి చేశారని గుర్తుచేసింది. ఇవ్వాలనుకుంటే ఒక్కరోజులో అందజేయవచ్చని వ్యాఖ్యానించింది. ఇంతకాలం ఏం చేస్తున్నారని నిలదీసింది. ఇంకా ఎంత సమయం కావాలో చెప్పాలని ప్రశ్నించింది.ఈనెల 16లోపు పిటిషనర్లకు సమాచారం ఇవ్వాలని డీజీపీ, పోలీసులను మౌఖికంగా ఆదేశించింది.

రెండ మూడు గంటల్లో ఇవ్వొచ్చు: ఎన్నికల్లో పోటీ చేసే పలువురు అభ్యర్థులు చేసిన విజ్ఞప్తి విషయంలో పోలీసులు స్పందించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల వద్ద సమాచారం ఉంటుందని, కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రెండు మూడు గంటల్లోనే వాటిని అందజేయవచ్చని తెలిపింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈ వివరాలను అందజేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టంచేసింది. ఈ మార్గదర్శకాలను పాటించి ఉంటే ఇప్పటికే సమాచారాన్ని తెప్పించి ఉండేవారని ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది.

ప్రత్యేక అధికారులను నియమించండి: నామినేషన్ల సమయంలో కేసుల గురించి ప్రస్తావించకపోతే అభ్యర్థులపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని హైకోర్టు గుర్తుచేసింది. పిటిషనర్లకు తెలియకుండా వారిపై కేసులు నమోదయి ఉండొచ్చని, వాటిలో సీఆర్‌పీసీ సెక్షన్‌ 41(ఏ) కింద నోటీసు ఇచ్చి ఉండకపోవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో వారికి కేసుల సమాచారాన్ని ఇచ్చేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించింది. ఈ ప్రక్రియను తక్షణం ప్రారంభించాలని తేల్చిచెప్పింది. ఈనెల 16లోపు పిటిషనర్లకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. విచారణను 16కు వాయిదా వేసింది.

ADCP Venkata Ratnam counseling for rowdy sheeters : 'డిసెంబర్ వరకు తప్పు చేయకుండా ఉంటేనే..!' విజయవాడ రౌడీషీటర్లకు పోలీస్ ఆఫర్..

వేర్వేరుగా వ్యాజ్యాలు:రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఠాణాల్లో తమపై నమోదు చేసిన కేసుల వివరాలను అందించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు పొంగూరు నారాయణ, చింతకాయల అయ్యన్నపాత్రుడు, మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, వంగలపూడి అనిత, బోండా ఉమామహేశ్వరరావు, భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బి.రామచంద్రయాదవ్‌ తదితరులు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. శుక్రవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్, న్యాయవాదులు వీవీ లక్ష్మీనారాయణ, వీవీ సతీష్, పీవీజీ ఉమేశ్‌చంద్ర తదితరులు వాదనలు వినిపించారు. ఈనెల 18న ఎన్నికల నోటిఫికేషన్‌ రానుందని గుర్తుచేశారు.

కర్నూలు పోలీస్​స్టేషన్‌లో దొంగలుపడ్డారు.. విలువైన వెండి ఆభరణాలు మాయం

డీజీపీకి వినతి సమర్పించినా స్పందన కరవు: పిటిషనర్లు తమపై నమోదైన కేసుల వివరాలను నామినేషన్‌ దాఖలు సమయంలో సమర్పించకపోతే అనర్హత వేటు పడే ప్రమాదం ఉందన్నారు. వాటి కోసం డీజీపీకి వినతి సమర్పించినా ఇప్పటి వరకు స్పందన లేదని తెలిపారు. వెంటనే సమాచారం ఇచ్చేలా ఆదేశించాలని కోరారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ, ఎస్పీలను వివరాలు కోరకుండా నేరుగా డీజీపీకి వినతి ఇచ్చారని, అందుకే వారి నుంచి సమాచారం తెప్పించడంలో ఇబ్బంది ఏర్పడిందని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తామన్నారు.

రాష్ట్రంలోని అన్ని పోలీస్​ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి : సీఈవో మీనా

ABOUT THE AUTHOR

...view details