ADCP Venkata Ratnam counseling for rowdy sheeters : 'డిసెంబర్ వరకు తప్పు చేయకుండా ఉంటేనే..!' విజయవాడ రౌడీషీటర్లకు పోలీస్ ఆఫర్..

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2023, 7:32 PM IST

thumbnail

ADCP Venkata Ratnam counseling for rowdy sheeters : విజయవాడలో రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీట్లు, నేర చరిత్ర ఉన్న వారికి ఏడీసీపీ వెంకట రత్నం కౌన్సిలింగ్ ఇచ్చారు. సీసీఎస్ పోలీస్ స్టేషన్ వద్ద కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు. ప్రతీ వారం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లకు ప్రత్యక్షంగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామని ఏడీసీపీ హెచ్చరించారు. నేరచరిత కలిగి ఉన్న వారిపై నిత్యం నిఘా ఉంటుందని తెలిపారు. డిసెంబర్ వరకు ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటే వారిపై ఉన్న రౌడీషిట్ ను కొట్టి వేస్తామని ఏడీసీసీ తెలిపారు. వారం రోజులు కష్టపడి పనిచేసి సంపాదించింది అంతా వారాంతంలో జల్సాలకు ఖర్చు చేస్తున్నారని, ఆరోగ్యం చెడిపోవడంతోపాటు.. మద్యం మత్తులో పలు రకాల నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. రౌడీ షీట్​ నమోదైన వ్యక్తులు ఏ చిన్న నేరానికి పాల్పడినా వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఇటీవల నగరంలో ఉన్న కొన్ని పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్ లు హల్ చల్ చేస్తున్నాయి. మరోవైపు రౌడీషీటర్ల అనుచరులు, గ్యాంగ్ వార్ లో పాల్గొన్న కీలక వ్యక్తుల కదలికలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రౌడీషీటర్లకు జరుగుతున్న కౌన్సిలింగ్ ప్రాధాన్యం సంచరించుకుంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.