ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తక్కువ సమయం ఇచ్చి రమ్మంటే ఎలా? ప్రభుత్వ లేఖపై చంద్రబాబు ఆగ్రహం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2024, 11:06 AM IST

Updated : Feb 8, 2024, 12:06 PM IST

Chandrababu Fires on Government Letter: రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకం, ఉపలోకాయుక్త పోస్టును భర్తీపై సీఎం అధ్యక్షతన ఈరోజు నిర్వహించనున్న సమావేశానికి రావాలని కమిటీలో సభ్యుడైన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ప్రభుత్వం లేఖ రాసింది. ఖాళీ అయిన 3 సమాచార కమిషనర్ల భర్తీకి నిర్వహించే కమిటీ మీటింగ్‌కు హాజరు కావాలని లేఖలో పేర్కొంది. మీటింగ్‌ ఉందని 3 రోజుల ముందు సమాచారం ఇవ్వడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం రెండు వారాల ముందుగా సమాచారం ఇవ్వాలని లేఖ ద్వారా బదులిచ్చారు. కమిషనర్ల పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న వారి పూర్తి వివరాలు కూడా ఇవ్వాలని కోరారు.

Chandrababu_Fires_on_Government_Letter
Chandrababu_Fires_on_Government_Letter

Chandrababu Fires on Government Letter: ప్రభుత్వం, వివిధ సంస్థల్లో కీలకమైన పోస్టులన్నీ అస్మదీయులకు కట్టబెడుతున్న జగన్ ప్రభుత్వం ఎన్నికల ముంగిట మరింత జోరు పెంచింది. ఖాళీగా ఉన్న సమాచార కమిషనర్ల పోస్టులు మూడింటితో పాటు, ఉపలోకాయుక్త పోస్టును భర్తీ చేసేందుకు గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన రెండు కమిటీల సమావేశాలు నిర్వహిస్తోంది. సమావేశాలకు రావాలంటూ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu)కు లేఖలు పంపింది. కేవలం ఒకటి, రెండు రోజుల ముందు సమాచారం పంపి సమావేశాల (Meeting)కు పిలవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల గురువారం సమావేశాలకు రాలేనని చంద్రబాబు స్పష్టం చేశారు.

CBN Angry on Jagan: నాది ముందుచూపు.. జగన్​ది దొంగచూపు: టీడీపీ అధినేత చంద్రబాబు

Letter To Chandrababu For Appointment of State Information CommissionerMeeting: ఈ మేరకు ఆయన బుధవారం చంద్రబాబు సాధారణ పరిపాలన శాఖకు లేఖలు పంపారు. 3 రోజుల ముందు సమాచారం ఇవ్వడంపై బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి బయోడేటాలు పంపిస్తే వారి నేపథ్యం, అర్హతల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని చంద్రబాబు తెలిపారు. "సమాచార కమిషనర్ల ఎంపిక కమిటీ సమావేశానికి రావాలని ఈ నెల 5న ప్రభుత్వం నోటీసు పంపింది. ఆ లేఖ అదే రోజు తనకు అందిందని బాబు స్పష్టం చేశారు. కనీసం రెండు వారాల గడువు ఇచ్చి, ఆ తర్వాత సమావేశం జరపాలి" అని సాధారణ పరిపాలన శాఖ (జీపీఎం అండ్ ఏఆర్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు బుధవారం రాసిన లేఖలో పేర్కొన్నారు.

జగన్​ పాలనలో చిన్నపిల్లలు సైతం నిరసన బాట: చంద్రబాబు

ఉపలోకాయుక్త ఎంపిక కమిటీ సమావేశానికి హాజరవ్వాలంటూ మంగళవారం పంపినట్టు ఉన్న నోటీసు తనకు బుధవారం అందిందని బాబు తెలిపారు. సమావేశానికి ఒక్కరోజు ముందు వర్తమానం పంపడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విశ్రాంత జిల్లా న్యాయమూర్తులు, హైకోర్టులో కనీసం 25 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉన్న న్యాయవాదులు ఉపలోకాయుక్త పోస్టుకు అర్హులని నిబంధన పెట్టడంపై చంద్రబాబు అభ్యంతరం తెలియ చేశారు. ఇది అడ్వకేట్ల చట్ట నిబంధనలకు విరుద్ధమన్నారు. ఆ చట్టంలో 'అడ్వకేట్స్ అండ్ సీనియర్ అడ్వకేట్స్' అని మాత్రమే పేర్కొన్నారని తెలిపారు. ఉపలోకాయుక్త పోస్టుకు దరఖాస్తు చేసుకున్నవారి బయోడేటాల్ని కూడా తనకు పంపాలని కోరుతూ సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శిని చంద్రబాబు లేఖలో కోరారు. ఉపలోకాయుక్త ఎంపిక కమిటీకి ముఖ్యమంత్రి చైర్మన్ గాను, శాసనసభాపతి, శాసనమండలి చైర్మన్, ప్రధాన ప్రతిపక్షనేత సభ్యులుగాను ఉంటారు.

భవిష్యత్ తరాల కోసమే యుద్ధం.. వారితోనే నా పోరాటం: చంద్రబాబు

Last Updated : Feb 8, 2024, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details