ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వేసవి రాకుండానే అడుగంటుతున్న కాలువలు - గ్రామాల్లో ఆగిపోయిన నీటి సరఫరా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2024, 11:53 AM IST

Canals Drying Due to Lack of Water: వేసవి మొదలవ్వకుండానే నీటి సమస్యలు బాపట్ల ప్రజలను వెంటాడుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్ మే నెలలో సమస్య మరింత తీవ్రంగా ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నేపథ్యంలో ముందుగానే పులిచింతల నుంచి నేటి సరఫరా నిలిచిపోయింది.

Etv Bharat
Etv Bharat

వేసవి రాకుండానే అడుగంటుతున్న కాలువలు - గ్రామాల్లో ఆగిపోయిన నీటి సరఫరా

Canals Drying Due to Lack of Water:వేసవి కాలం రాకుండానే నీటి సమస్యలు బాపట్ల పట్టణ ప్రజలను వెంటాడుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్​మే నెలలో సమస్య మరింత తీవ్రంగా ఉంటుందని ప్రజలలో ఆందోళన వ్యక్తం అవుతుంది. బాపట్ల జిల్లాలో పురపాలక పట్టణంలోని ప్రజలకు అవసరమైన తాగునీటి అవసరాలు కొమ్మమూరు కెనాల్ ద్వారానే తీరుతాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నేపథ్యంలో ముందుగానే పులిచింతల నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రకాశం బ్యారేజీ నుంచి కొమ్మమూరు కాల్వకు నీటి ప్రవాహం లేకుండా పోయింది. ఈ ప్రభావం ప్రస్తుతం పురపాలక ప్రజలతోపాటు ఆ కాలువ నీటిపై ఆధారపడే వందల పడింది.

ఒంగోలులో దాహం కేకలు- తాగేందుకు నీళ్లు లేక నానా అవస్థలు పడుతున్న ప్రజలు

బాపట్ల సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌లో పూర్తిస్థాయిలో నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. మరోవైపు కొమ్మమూరుతెనాలిలో నీటి సరఫరా ఎప్పుడు నిలిచిపోతుందో తెలియని దుస్థితి నెలకొంది. అయినా అధికార యంత్రాంగం అప్రమత్తం కావడం లేదు సమస్య త్రేవర రూపం దాలుస్తుందని ముందుగానే గుర్తించి ఈ మధ్య పురపాలక అధికారులు జల వనరుల శాఖ అధికారులతో సమావేశమై సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు చెరువులకు సామర్థ్యం మేరకు నీటి నిల్వలు నింపుకోవటానికి నీళ్లు విడుదల చేయించాలని కలెక్టర్​కు లేఖ రాయించారు. ఆమెరకు ఇటీవల పులిచింతల నుంచి నీళ్లు విడుదలైన వాటిని మోటార్ల ద్వారా ట్యాంకులకు, చెరువులకు నింపుకొని నీటి నిల్వలు చేయాల్సి ఉన్నా ఆ పని చేయలేదు. ప్రస్తుతం నీటి ప్రవాహం తగ్గటంతో మోటార్లు వేసినా నీళ్లు ట్యాంకులోకి చేరటం లేదు.

శ్రీశైలం నీళ్లు అమ్మకం - బడా వాణిజ్య రైతులతో అధికారుల కుమ్మక్కు !

జిల్లా కేంద్రం బాపట్లలో సమస్య మరింత తీవ్రంగా ఉంది. అక్కడ చెరువులో నీళ్లు చాలావరకు అడుగంటాయి. అయినా దాన్ని నింపుకోలేదు, అక్కడ అయితే కేవలం ఈ నెలాఖరుకు మాత్రమే నీటి నిల్వలు సరిపోతాయని మిగిలిన రోజుల్లో కొరత లేకుండా నీళ్లు ఇవ్వాలంటే ఇప్పటికే ట్యాంకులో నీటి నిల్వలు చేసుకుని ఉండాలని అధికారులు అంటున్నారు. దీంతో పట్టణ ప్రజలకు రోజు మార్చి రోజు కుళాయిలకు నీరు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం పులిచింతల నుంచి అవసరాలకు నీళ్లు విడిచారు. తిరిగి రెండోసారి వదులుతారో లేదో తెలియకుండా ఉంది. అక్కడ 11 టీఎంసీలు నీళ్లు ఉన్నాయని వాటిల్లో 3 టీఎంసీలు అసలు వాడకూడదని అంటున్నారు. మిగిలిన 8 టీఎంసీల నీటిని బాగా నీటి తీవ్రత వచ్చినప్పుడు తప్ప సాధారణంగా అయితే విడిచి పెట్టరు.

'గొంతెండుతోంది మహాప్రభో' - వేసవికి ముందే తాగునీటి సమస్య జఠిలం

మొన్న నీళ్లు వదిలినప్పుడే యంత్రాంగం అప్రమత్తమై ట్యాంకులు నింపుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అప్పట్లో మోటార్లు మరమ్మత్తులకు గురయ్యాయని కొన్నిచోట్ల మరికొన్ని చోట్ల నింపుకుందాం లే అని నిర్లక్ష్యం వహించడం ఆలోపే నీటి ప్రవాహం తగ్గటంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియకుండా యంత్రాంగం ఉంది. ప్రకాశం బ్యారేజీలో 12 అడుగులకు పైగా నీటిమట్టం ఉంటేనే కెనాల్​కు నీటి సరఫరా ప్రారంభమవుతుంది. ముందుగానే పొరపాలికలు స్పందించి స్టోరేజీ ట్యాంకులు నింపుకొని రాబోయే మూడు నాలుగు మాసాల వరకు నీటి సమస్య లేకుండా చూసుకుంటే ఇప్పడు నీటి కోసం చింతిచాల్సిన పరిస్థితి ఉండేదికాదు.

ABOUT THE AUTHOR

...view details