ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏపీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదల - అర్ధరాత్రి రిలీజ్ చేసిన ఏపీపీఎస్సీ - AP Group1 Prelims Results Released

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 14, 2024, 9:26 AM IST

AP Group1 Prelims Results Released: ఏపీపీఎస్సీ శుక్రవారం అర్ధరాత్రి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల చేసింది. సెప్టెంబరు 2 నుంచి 9 వరకు నిర్వహించనున్న మెయిన్స్‌ పరీక్షలకు 4,496 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది.

AP_Group1_Prelims_Results_Released
AP_Group1_Prelims_Results_Released

AP Group1 Prelims Results Released: ఏపీపీఎస్సీ (ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) శుక్రవారం అర్ధరాత్రి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల చేసింది. సెప్టెంబరు 2వ తేదీ నుంచి 9 వరకు నిర్వహించనున్న గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షలకు ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 4,496 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. గతేడాది డిసెంబరు నెలలో జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌ ద్వారా 81 గ్రూప్‌-1 పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది.

2018 గ్రూప్-1 రద్దుపై హైకోర్టు స్టే - HC Stay on Group 1 Cancellation

ట్యాంపరింగ్‌, ఓఎంఆర్‌ షీట్‌పై బుక్‌లెట్‌ సీరియల్‌ నంబర్లు లేకపోవడం, మల్టిపుల్‌ బుక్‌లెట్‌ సిరీస్‌ నంబర్లు నమోదు చేయడం వంటి కారణాలతో 567 మంది జవాబు పత్రాలను మూల్యాంకనం చేయకుండా తిరస్కరించినట్లు వెల్లడించింది. ఫలితాలతో పాటు ఫైనల్‌ 'కీ' సైతం విడుదల చేసింది. శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఏపీపీఎస్సీ ఈ ఫలితాలను ప్రకటించడం గమనార్హం. గతంలో ఎన్నడూ ఇలా జరగని విధంగా దీనికి సంబంధించిన పత్రికా ప్రకటనను రాత్రి 1.40 గంటలకు జారీ చేసింది.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1లో 250కోట్ల కుంభకోణం: టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ప్రణవ్​ గోపాల్​ - TNSF Pranav Gopal Complaint

'1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి' : గ్రూప్‌-2 మాదిరిగానేగ్రూప్‌-1ప్రిలిమ్స్‌లో కూడా ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున అభ్యర్థులను ఎంపిక చేయాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ షేక్‌ సిద్ధిక్‌ డిమాండ్‌ చేశారు. 'గ్రూప్‌-1, 2 నోటిఫికేషన్లకు అనుగుణంగా సన్నద్ధమయ్యేందుకు ఏపీపీఎస్సీ ఇచ్చిన సమయం తక్కువగా ఉందన్నారు. తొలుత చెప్పినట్లు కొత్త సిలబస్‌ కాకుండా చివర్లో పాత సిలబస్‌తో ప్రిలిమ్స్‌ నిర్వహించడం వల్ల అభ్యర్థులు వెనకబడ్డారని తెలిపారు. ముఖ్యంగా తెలుగు మాధ్యమం వారు నష్టపోయారు అని షేక్‌ సిద్ధిక్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

''గ్రూప్‌-2 మాదిరిగానే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో కూడా ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున అభ్యర్థులను ఎంపిక చేయాలి. గ్రూప్‌-1, 2 నోటిఫికేషన్లకు అనుగుణంగా సన్నద్ధమయ్యేందుకు ఏపీపీఎస్సీ ఇచ్చిన సమయం తక్కువగా ఉంది. తొలుత చెప్పినట్లు కొత్త సిలబస్‌ కాకుండా చివర్లో పాత సిలబస్‌తో ప్రిలిమ్స్‌ నిర్వహించడం వల్ల అభ్యర్థులు వెనకబడ్డారు. ముఖ్యంగా తెలుగు మాధ్యమం వారు నష్టపోయారు''- షేక్‌ సిద్ధిక్‌, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌

గ్రూప్‌-1 మార్కుల వెల్లడికీ ఏపీపీఎస్సీ గోప్యత - APPSC RESTRICTIONS ON GROUP 1 MARKS

ABOUT THE AUTHOR

...view details