ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోస్టల్ బ్యాలెట్​కు మరో రెండు రోజులు గడువు- ఏ ఒక్కరూ ఓటింగ్​కు దూరం కావొద్దు: మీనా - AP CEO Visit Postal Ballot Center

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 5, 2024, 5:34 PM IST

Updated : May 5, 2024, 7:12 PM IST

AP CEO Meena Visited Postal Ballot Center in Vizianagaram: పోస్టల్ బ్యాలెట్ అందనివారి కోసం మరో రెండు రోజులు గడువు పెంచుతున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. విజయనగరంలోని జేఎన్టీయూ-గురజాడ విశ్వవిద్యాలయంలోని పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని మీనా సందర్శించారు. అందిన ఫిర్యాదులపై వేగవంతంగా స్పందిస్తున్నామని చెప్పారు.

ap_ceo_meena
ap_ceo_meena (Etv Bharat)

AP CEO Meena Visited Postal Ballot Center in Vizianagaram:పోస్టల్ బ్యాలెట్ విషయంలో పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా (AP Chief Election Officer Mukesh Kumar Meena) తెలిపారు. అందిన ఫిర్యాదులపై వేగవంతంగా స్పందిస్తున్నామని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ అందనివారి కోసం మరో రెండు రోజులు గడువు పెంచుతున్నామని వివరించారు. విజయనగరంలోని జేఎన్​టీయూ- గురజాడ విశ్వవిద్యాలయంలోని (JNTU-GV COLLEGE OF ENGINEERING VIZIANAGARAM) పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని మీనా సందర్శించారు.

స్థిరాస్తులే లేని జగన్ కుటుంబానికి లక్షలాది కోట్ల ఆస్తులా వచ్చాయి: ఆనం - Anam Venkata Ramana Reddy

పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో ఏర్పాట్లు, సదుపాయల కల్పన, ఓటర్ల హాజరు తదితర విషయలపై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. ఇవాళ బ్యాలెట్ ఓటు అందడం, గెజిటెడ్ సంతకం తదితర విషయాలపై ఫిర్యాదులు వచ్చాయని మీనా తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఫెసిలిటేషన్ కేంద్రంల్లో సదుపాయాల కల్పనపై అనేత ఫిర్యాదులు అందాయని సీఈఓ మీనా తెలిపారు. ఈ రోజు, బ్యాలెట్ ఓటు అందటం గెజిటెడ్ సంతకం తదితర విషయాలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. వీటన్నింటి దృష్ట్యా పోస్టల్ బ్యాలెట్ దాఖలు గడువుని మరో రెండు రోజులు పెంచుతున్నట్ల సీఈవో చెప్పారు.

నాపరాయి పరిశ్రమకి గడ్డుకాలం - వైఎస్సార్సీపీ పాలనలో వీధిన పడ్డ కార్మికులు - YCP Destroyed Black Stone Industry

ఎన్నికల విధుల్లో పాల్గొననున్న ఏ ఒక్కరూ ఓటింగ్ దూరం కాకుండదనేది ఎలక్షన్ కమిషన్ (Election Commission) లక్ష్యమని అన్నారు. ఈ మేరకు వివిధ కారణాలతో పోస్టల్ బ్యాలెట్​కు దూరమైన వారి కోసం ఈ నెల 7, 8న ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మీనా తెలియజేశారు. అదే విధంగా ఎన్నికల ఏర్పాట్లు రాష్ట్రంలో తుది దశకు చేరుకున్నాయని మీనా అన్నారు.

పోస్టల్ బ్యాలెట్​కు మరో రెండు రోజులు గడువు- ఏ ఒక్కరూ ఓటింగ్​కు దూరం కావొద్దు: మీనా (Etv Bharat)

రాజకీయ లబ్ధికి జగన్​ ఆరాటం - పింఛన్​ కోసం విలవిల్లాడుతున్న వృద్ధులు - Pensioners Died in Andhra Pradesh

పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ ప్రక్రియను (Postal Ballot and Home Voting Process) ఈ నెల 9లోగా పూర్తిచేస్తామని మీనా తెలిపారు. అనంతరం పోలింగ్ సామగ్రి పంపిణీపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తామన్నారు. ఎన్నికల ఫిర్యాదులపై సీఈఓ స్పందిస్తూ సీ-విజిల్ ద్వారా ఇప్పటి వరకు 16 వేలకు పైగా ఫిర్యాదులు అందగా 11 వేల సమస్యలు పరిష్కరించామని మీనా తెలిపారు. కమిషన్ కార్యాలయానికి నేరుగా 500 అందగా 400 పరిష్కరించామని అన్నారు. సోషల్ మీడియా ఫిర్యాదులపైనా స్పందిస్తుని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు.

Last Updated : May 5, 2024, 7:12 PM IST

ABOUT THE AUTHOR

...view details