ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'అమరావతిని బతికించుకోవాలంటే టీడీపీని గెలిపించుకోవాలి' ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థులు - Alliance Leaders Election Campaign

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 9, 2024, 7:36 AM IST

Alliance Leaders Election Campaign in AP : రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రజలకు సూపర్​ సిక్స్​ పథకాలపై అభ్యర్థులు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రం బాగుపడాలంటే ఎన్డీయే కూటమిని గెలిపించాలని ఓటర్లును అభ్యర్థిస్తున్నారు.

election_campaign
election_campaign

Alliance Leaders Election Campaign in AP :రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం సూపర్‌సిక్స్‌ పథకాల గురించి ఓటర్లకు వివరించారు. పలు జిల్లాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. పలు జిల్లాల్లో వైసీపీ నేతలు పెద్దఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు.

వైసీపీ నేతల కుట్రలు - ఆ పార్టీ కార్యకర్తలకే కండువా కప్పి టీడీపీ నుంచి చేరినట్టు ప్రచారం - YCP Leader Venkatarami Reddy

Guntur District : గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు విస్తృత ప్రచారం చేశారు. తాడికొండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్‌ అమరావతి రైతులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాజధాని అమరావతిని బతికించుకోవాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెనాలి అసెంబ్లీ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే చంద్రబాబు సీఎం కావాలి : ఆనం రామనారాయణ రెడ్డి - TDP Leader Election Campaign

East Godavari : తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి పెరవలి మండలం కానూరులో నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మూడు పార్టీల నేతలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.
Anakapalli District :అనకాపల్లి జిల్లా ముస్లింలతో ఆ నియోజకవర్గ ఎన్డీయే కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు సీఎం రమేష్‌, కొణతాల రామకృష్ణ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండ్రు మురళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కృష్ణా జిల్లా పెడనలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్‌ సతీమణి కాగిత శిరీష ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలకు టీడీపీ సూపర్‌సిక్స్‌ పథకాలను వివరించారు. రంజాన్‌ మాసం సందర్భంగా విజయవాడ నగర శివారు గొల్లపూడిలోని స్థానిక తెలుగుదేశం పార్టీ నేత బొమ్మసాని సుబ్బారావు ముస్లింలకు భారీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్‌, విజయవాడ లోక్‌సభ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, జలీల్‌ఖాన్‌తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

'టీడీపీ పాలనలో అన్నివర్గాల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ' జోరుగా టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం - TDP Leaders Election Campaign

Kurnool District :కర్నూలు జిల్లా పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరిత కూటమి సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కర్నూలు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్‌ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మిగనూరు నియోజవర్గం సొగనూరు గ్రామంలో పలువురు కార్యకర్తలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు కూటమి నేతలతో ఉమ్మడి సమన్వయ సమావేశం నిర్వహించారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ ఎన్డీయే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ కూటమి అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో ఆరు మండలాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు.

ABOUT THE AUTHOR

...view details