తెలంగాణ

telangana

ప్రేమలో పడి క్రికెట్​పై శ్రేయస్ నో ఫోకస్​- వెంటనే అలా చేసిన తండ్రి- ఇక అయ్యర్ లైఫ్​ సెట్​! - Shreyas Iyer Life Story

By ETV Bharat Telugu Team

Published : Apr 14, 2024, 3:43 PM IST

Shreyas Iyer Life Story: శ్రేయస్ అయ్యర్‌ అతి చిన్న వయస్సుల్లోనే ఐపీఎల్‌ టీమ్‌కి కెప్టెన్‌ అయ్యాడు. దిల్లీని మొదటిసారి ఫైనల్‌కి తీసుకెళ్లి రికార్డు సృష్టించాడు. ఇప్పుడు కేకేఆర్‌తో టైటిల్‌ పోరులో ముందున్నాడు. కానీ ఒకప్పుడు అయ్యర్‌ ప్రేమలో పడి క్రికెట్‌ని నిర్లక్ష్యం చేస్తున్నాడని అతని తండ్రి భావించాడని మీకు తెలుసా?

Shreyas Iyer Life Story
Shreyas Iyer Life Story

Shreyas Iyer Life Story:టీమ్‌ఇండియా ఫ్యూచర్‌ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు గుర్తొచ్చే ప్లేయర్స్‌లో శ్రేయస్ అయ్యర్‌ ఒకడు. ప్రస్తుత ఐపీఎల్‌ 2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అంతకు ముందు అయ్యర్‌ నేతృత్వంలో దిల్లీ ఫైనల్‌కి కూడా చేరింది. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లోనూ అయ్యర్‌ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023 వన్డే వరల్డ్‌ కప్‌లో 10 ఇన్నింగ్స్‌ల్లో 526 పరుగులు చేశాడు.

నెదర్లాండ్స్, న్యూజిలాండ్‌పై వరుస సెంచరీలతో టీమ్‌ ఇండియా జైత్రయాత్రలో కీలకంగా మారాడు. అయ్యర్‌ని సహచరులు యంగ్‌ వీరూ అని పిలుస్తారు. ఛేజింగ్‌లో టీమ్‌ కష్టాల్లో ఉన్నప్పుడు ఒత్తిడి లేకుండా పరుగులు రాబట్టే అయ్యర్‌ సామర్థ్యం ఫ్యాన్స్‌, క్రిటిక్స్‌కి నచ్చుతుంది. ఇవన్నీ ఆడియెన్స్​, ఫ్యాన్స్​కు తెలుసినవే. మరి అయ్యర్‌ కెరీర్‌, రిలేషన్‌షిప్‌, నెట్​వర్త్​ గురించి మీకు తెలుసా?

అప్పుడే టాలెంట్‌ గుర్తించిన తండ్రి
అయ్యర్ 1994 డిసెంబర్ 6న ముంబయలో సంతోష్ అయ్యర్, రోహిణి అయ్యర్‌ దంపతులకు జన్మించారు. గ్రాడ్యుయేషన్‌ వరకు ముంబయిలోనే చదువుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ నాలుగేళ్ల వయసులో ప్లాస్టిక్ బాల్‌తో క్రికెట్ ఆడేటప్పుడే అతని సామర్థ్యం గుర్తించినట్లు సంతోష్‌ అయ్యర్‌ పేర్కొన్నారు. మంచి బ్యాటర్​ అవుతాడని గుర్తించి ప్రోత్సహించినట్లు తెలిపారు.

ప్రేమలో పడ్డ శ్రేయస్ అయ్యర్‌!
శ్రేయస్ అయ్యర్ అండర్-16 ఆడుతున్నప్పుడు గొప్పగా రాణించలేదు. ప్రదర్శన తగ్గిపోవడం వల్ల సంతోష్‌ అయ్యర్‌ ఆందోళన చెందాడు. తన కొడుకుకు సామర్థ్యం ఉన్నా, ఫోకస్‌ కోల్పోయాడని చెప్పడం వల్ల, శ్రేయస్ ప్రేమలో పడ్డాడని భావించారు. చివరికి తన కుమారుడిని సైకాలజిస్ట్‌ వద్దకు తీసుకెళ్లారు. ప్రతి క్రీడాకారుడు తన కెరీర్‌లో పదే పదే ఎదుర్కొనే సమస్యలేనని, రిలాక్స్‌గా ఉండమని సైకాలజిస్ట్‌ చెప్పడంతో సంతోష్ అయ్యర్‌కి ధైర్యం వచ్చింది. ఆ తర్వాత అయ్యర్‌ వెంటనే ఫామ్‌ అందుకున్నాడు.

శ్రేయస్ అయ్యర్ కెరీర్
శ్రేయస్ అయ్యర్ 59 వన్డేల్లో 2383, 14 టెస్టుల్లో 811 పరుగులు చేశాడు. టీ20ల్లో కేవలం 51 మ్యాచ్‌ల్లో 1104 రన్స్‌ స్కోర్‌ చేశాడు. ఐపీఎల్‌లో కూడా శ్రేయాస్‌ అద్భుతంగా రాణించాడు. 103 మ్యాచ్‌లలో 2815 పరుగులు చేశాడు. అయ్యర్‌కు 18 ఏళ్లు ఉన్నప్పుడు అతని ప్రతిభను భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే గుర్తించాడు. అతడిని పిలిపించి శిక్షణ ఇచ్చాడు. ప్రవీణ్ ఆమ్రే గైడెన్స్‌లో యంగ్‌ క్రికెటర్ చాలా మెరుగుపడ్డాడు. దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ లాగా మొదటి నుంచి ఎదురుదాడికి దిగే స్వభావం ఉండడం వల్ల 'యంగ్ వీరు' అనే పేరు వచ్చింది.

2014 నవంబర్‌లో ముంబయి తరఫున 2014-15 విజయ్ హజారే ట్రోఫీలో అయ్యర్ తన లిస్ట్ A అరంగేట్రం చేశాడు. 2014-15కి రంజీ ట్రోఫీకి ఛాన్స్‌ దక్కింది. తొలి రంజీ ట్రోఫీ సీజన్‌లో 809 పరుగులు చేయడంతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 2017 నవంబర్ 1న న్యూజిలాండ్‌పై T20I అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత నెలలో శ్రీలంకపై ODI అవకాశం అందుకున్నాడు. వెంటనే దిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్) శ్రేయస్ అయ్యర్‌ను రూ.2.6 కోట్లకు కొనుగోలు చేసింది. అతడు 2018లో 23 ఏళ్ల వయస్సుకే దిల్లీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం ఐపీఎల్ చరిత్రలో తక్కువ వయస్సులో కెప్టెన్‌ అయిన వారిలో మూడో ప్లేయర్. 2021లో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 2022 ఐపీఎల్‌ వేలంలో, కోల్‌కతా నైట్ రైడర్స్‌కి వెళ్లి కెప్టెన్ అయ్యాడు.

నెట్‌వర్త్‌ ఎంత?
శ్రేయస్ అయ్యర్ BCCIతో గ్రేడ్ B కాంట్రాక్ట్‌లో రూ.3 కోట్ల వార్షిక వేతనం అందుకుంటున్నాడు. కేకేఆర్‌ నుంచి రూ.12.25 కోట్లు దక్కుతోంది. వివిధ బ్రాండ్‌లకు ఎండార్సింగ్‌ చేస్తూ భారీగానే సంపాదిస్తున్నాడు. అతని నికర ఆస్తుల విలువ రూ.58 కోట్లుగా నివేదికలు పేర్కొంటున్నాయి. అతనికి ముంబయిలోని లోధా వరల్డ్ క్రెస్ట్, లోయర్ పరేల్‌ 4BHK ప్లాట్‌ ఉంది. దీని ఖరీదు దాదాపు రూ.11.85 కోట్లు. అతని వద్ద మెర్సిడెస్-బెంజ్ G63 AMG (రూ.2.45 కోట్లు), లంబోర్ఘిని హురాకాన్ (రూ.3 కోట్లు), ఆడి S5 (రూ. 75 లక్షలు) ఉన్నాయి.

శ్రేయస్ అయ్యర్ స్నేహితురాలు?
2023 నవంబర్‌లో టీమ్ ఇండియా దీపావళి వేడుకల సందర్భంగా శ్రేయస్ అయ్యర్ మిస్టరీ గర్ల్‌తో కనిపించాడు. వారి ఫోటో సోషల్ మీడియాలో వచ్చిన వెంటనే, డేటింగ్ చేస్తున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత శార్దూల్‌ ఠాకూర్, అతని భార్య మిట్టాలి పరుల్కర్‌తో కలిసి శ్రేయస్, త్రిష డిన్నర్‌ చేస్తూ కనిపించారు. దీంతో ఆరోపణలకు మరింత ఆజ్యం పోసినట్లు అయింది. రిలేషన్ షిప్ పుకార్లపై ఇప్పటి శ్రేయస్ కానీ, త్రిష కానీ స్పందించలేదు.

శ్రేయస్ క్రష్ ఆ అమ్మాయే - సీక్రెల్ రివీల్ చేసిన కేకేఆర్ కెప్టెన్ - Shreyas Iyer Crush

KKR ఫ్యాన్స్​కు షాకింగ్ న్యూస్- ఐపీఎల్​కు అయ్యర్ దూరం!

ABOUT THE AUTHOR

...view details