ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జనం సొమ్ము తీసుకుంటూ జగన్ సేవలో గ్రామ వాలంటీర్లు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 10:27 AM IST

Village Volunteers Working as YSRCP Activists: ఉద్యోగులు ప్రభుత్వానికి కళ్లు, చెవుల్లాంటివారు. కానీ తనకే చెవులు, కళ్లలా పనిచేయాలన్నది జగన్‌ సిద్ధాంతం.అందుకే వాలంటీర్ల పేరుతో ఊరూరా సొంత సైన్యాన్ని నియమించుకున్నారు. జనం సొమ్మును గౌరవ వేతనంగా తీసుకుంటూ జగన్‌ సేవలో తరించే అరాచక ముఠాగా వారిని మార్చుకున్నారు. ప్రజల్ని పార్టీల వారీగా విభజించి పాలిచేందుకు వాలంటీర్లను పనిముట్టుగా ఎంచుకున్నారు. ఊళ్లమీదకు వదిలి వాళ్లు చేసే ఆకృత్యాలు, అరాచకాలను కళ్లప్పగించి చూస్తున్నారు.

Village_Volunteers_Working_as_YSRCP_Activists
Village_Volunteers_Working_as_YSRCP_Activists

జనం సొమ్ము తీసుకుంటూ జగన్ సేవలో గ్రామ వాలంటీర్లు

Village Volunteers Working as YSRCP Activists : సర్కారీ సేవలను గడప గడపకూ చేర్చే స్వచ్ఛంద సేవకులంటూ వాలంటీర్ల వ్యవస్థను జగన్‌ మోహన్‌ రెడ్డి సృష్టించారు. పూర్తిగా ప్రజాధనంతోనే వాలంటీర్లను పెంచి పోషించిన జగన్‌ వారితో సొంత పార్టీ పనులు చేయించుకున్నారు. తమ చీకటి వ్యవహారాలన్నింటినీ వాలంటీర్ల చేతుల మీదుగానే జరిపించారు. సేవాదృక్పథం కలిగిన యువతీ, యువకులను వాలంటీర్లుగా నియమించామని, వారు పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నారని సీఎం చెప్పుకొచ్చారు. కానీ, వాలంటీర్లు వైఎస్సార్సీపీ కార్యకర్తలేనని పార్టీ అవససరాల కోసమే నియమితులయ్యారని జగన్‌ రాజకీయ కుట్రను ఆయన వందిమాగధులు, మంత్రులు, ఎమ్మెల్యేలే బయటపెట్టారు.

Volunteers in CM Jagan Service :సంక్షేమ పథకాలకు అర్హులెవరో గుర్తించడం అనేది సర్కారీ సిబ్బంది నిష్పాక్షికంగా నిర్వర్తించాల్సిన గురుతర బాధ్యత. తనకోసం, తనచేత నియమితులైన వాలంటీర్లకు దాన్ని కట్టబెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో చట్టబద్ధమైన పాలనను జగన్‌ పెళ్లగించి పారేశారు. వాలంటీర్ల వ్యవస్థకు చట్టబద్ధత ఉందా? వారికి సర్వీస్‌ రూల్స్‌ ఉన్నాయా? అసలు ప్రభుత్వ ఉద్యోగులేనా? లబ్ధిదారుల ఎంపికలో వారి జోక్యమేంటి? అని సాక్షాత్తూ హైకోర్టు ప్రభుత్వానికి ప్రశ్నాస్త్రాలు సంధించింది. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానేకారు! ఆ విషయం జగనే తేల్చి చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థను తెచ్చి తద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థను చావుదెబ్బ తీశారు. ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు.

Volunteers Working as YSRCP Activists: వాలంటీర్లను పార్టీ కార్యకర్తల్లా వాడేసుకుంటున్న జగన్.. ఐప్యాక్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ..!

జగన్‌ దొంగ రాజకీయాలకు ఒక పనిముట్టుగా వాలంటీర్ల వ్యవస్థబాగా ఉపయోగపడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటువేయాలని వాలంటీర్లు జనాన్ని ప్రభావితం చేశారు. తిరుపతి ఉపఎన్నికల్లోనైతే వైఎస్సార్సీపీ తరఫున ఇంటింటి ప్రచారమూ చేశారు. నెల్లూరు జిల్లా సంగంలోనైతే తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు వాలంటీర్లతో వైఎస్సార్సీపీ నేతలు రహస్యంగా భేటీ వేశారు.

వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచమని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ ఉత్తర్వులకు దిక్కూమొక్కూ లేకుండా పోయింది. ఓటర్ల జాబితాల్లో విచ్చలవిడిగా చోటుచేసుకున్న మార్పుచేర్పుల్లో కొందరు వాలంటీర్లే కీలకపాత్ర పోషించారు. సీఎం సభలకు రానివారికి సంక్షేమ పథకాలను తొలగిస్తామని లబ్ధిదారులను బెదిరించి మరీ బలవంతంగా తీసుకెళ్తున్నారు. ఇలా వైసీపీ జెండాలు మోయించడం కోసం ఏడాదికి దాదాపు 1900 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వాలంటీర్లకు ధారపోశారు జగన్‌.

వైసీపీ నాయకుల పట్ల స్వామి భక్తి చాటుకున్న వాలంటీర్లు - స్వాగతం పలుకుతూ బ్యానర్లు

తనకు మించిన నిజాయతీపరుడు ఇంకెవరూ లేరన్నట్టు జగన్‌ ఆత్మస్తుతి చేసుకుంటూ ఉంటారు. నిజానికి జనం సొమ్ముతో తన కరపత్రిక 'సాక్షి'సర్క్యులేషన్‌ను పెంచుకునే పన్నాగానికి పాల్పడేటంతటి గొప్పది ఆయన నిజాయతీ! దినపత్రిక కొనుగోలు పేరుతో ఒక్కొక్కరికి నెలకు 200 చొప్పున రెండున్నర లక్షల మందికి పైబడిన వాలంటీర్లు, లక్షా 45 వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకూ సొమ్ము మంజూరు చేసింది. 'సాక్షి'ని కొనాలని సర్కారీ ఆదేశాల్లో నేరుగా చెప్పకపోయినా ఆయా జీఓల్లోని షరతులు, తన బాకా ఊదని పత్రికలపై జగన్‌ కడుపుమంటను గమనిస్తే అయ్యవారి ఆంతర్యం ఎవరికైనా ఇట్టే బోధపడుతుంది. ఏడాదికి 80 కోట్ల రూపాయల వరకు జనం సొమ్మును వెదజల్లి వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులతో తనసొంతపత్రిక 'సాక్షి'ని కొనిపించడమే నీతిమాలిన జగన్‌ ఉద్దేశమన్నది బహిరంగ రహస్యమే.

జగన్‌ పెత్తందారీ ప్రభుత్వానికి కళ్లూచెవులుగా మెలుగుతున్న వాలంటీర్లలో కొందరు సంఘవ్యతిరేక శక్తులుగా తయారయ్యారు. ఘోర నేరాలకు పాల్పడ్డారు. ఆడపిల్లలపై అత్యాచారాల నుంచి అసహాయులపై అరాచక దాడుల వరకు నాటు తుపాకుల తయారీ మొదలు హత్యల దాకా కొంతమంది వాలంటీర్లు చేయని అకృత్యాలంటూ లేవు.

పింఛన్‌ సొమ్ములను, పంట పరిహారాలను దిగమింగిన వాలంటీర్ల బాగోతాలూ వెలుగు చూశాయి. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య ప్రమాణాలకు కట్టుబడని జగన్‌ విశృంఖలత్వమే దీనికి కారణం. జనం సొమ్ముతో జనానికే చేటుచేసిన జగన్మోసకారితనం ఆయనది!

వాలంటీర్లపై మరో బాధ్యత - ఓటర్ల కులాలు, పార్టీల వివరాలు సేకరించాలని వైఎస్సార్సీపీ హుకూం!

ABOUT THE AUTHOR

...view details