ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీకి టార్చ్ లైట్ గుర్తు కేటాయింపు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 14, 2024, 7:13 PM IST

Lakshmi Narayana Party Allotted Election Symbol as Torch Light : సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పార్టీకి ఎన్నికల సాధారణ గుర్తుగా టార్చి లైట్‌ను ఎన్నికల సంఘం కేటాయించింది. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్ధులకు కామన్ సింబల్ కేటాయించటం పట్ల ఈసీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

Etv Bharat
Etv Bharat

Lakshmi Narayana Party Allotted Election Symbol as Torch Light : సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పార్టీకి ఎన్నికల సాధారణ గుర్తుగా టార్చి లైట్‌ను ఎన్నికల సంఘం కేటాయించింది. వీవీ లక్ష్మీనారాయణ సారథ్యంలోని జైభారత్‌ నేషనల్‌ (Jai Bharat National Party Symbol) పార్టీకి పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల కామన్‌ సింబల్‌గా టార్చిలైట్‌ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్ధులకు కామన్ సింబల్ కేటాయించటం పట్ల ఈసీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత సొంత పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.

రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తా: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లక్ష్మీనారాయణ పోటీ : ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థిగా తాను విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్టు లక్ష్మీనారాయణ తెలిపారు. విశాఖలోని జై భారత్ నేషనల్ పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. గతంలో జనసేన పార్టీ తరఫున తాను విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశానని, ప్రస్తుతం తమ పార్టీ నిర్ణయం మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని అన్నారు. ఫ్రంట్ తరఫున లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి జీఎస్ఆర్​కేఆర్ విజయ్ కుమార్ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తారని, ఆల్ తెలుగు ప్రజా పార్టీ నాయకుడు డాక్టర్ కె శివ భాగ్య రావు బాపట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని, ప్రబుద్ధ రిపబ్లిక్ అండ్ పార్టీ అధ్యక్షుడు దాసరి చెన్నకేశవులు కొండేపి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని లక్ష్మీనారాయణ వివరించారు.

CBI EX JD Lakshmi Narayana Clarity On Next Election: పార్టీలను కాకుండా వ్యక్తులను చూసి ఓటు వేయాలి..: మాజీ జేడీ లక్ష్మీనారాయణ

రెండు కులాలు నాలుగు పార్టీల పాలనను అంతం చేయాలి :లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కి ప్రజలకు అందించాలని చెబుతున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి కనీసం కొద్ది మందైనా దారిద్రరేఖకు పైకి వచ్చారని చెప్పగలరా విజయ్ కుమార్ ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేసి, రెండు కులాలు నాలుగు పార్టీల పాలనను అంతం చేయాలని ఆయన కోరారు.

రాష్ట్రాభివృద్ధి, ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా జై భారత్​ మేనిఫెస్టో: లక్ష్మీనారాయణ

ABOUT THE AUTHOR

...view details