ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గేట్​ వే ఆఫ్ రాయలసీమ - కర్నూలు బురుజుపై జెండా ఎగరేసేదెవరో ? - Kurnool LOK SABHA ELECTIONS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 11:41 AM IST

Lok Sabha Elections in Kurnool Constituency : ఆంధ్ర రాష్ట్ర రాజధాని, గేట్​ వే ఆఫ్ రాయలసీమగా పేరొందింది కర్నూలు. ఈ నగరాన్ని రత్నాల నగరం అని కూడా పిలుస్తుంటారు. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న కర్నూలులో 16వ శతాబ్దంలో నిర్మించిన కొండారెడ్డి బురుజు చారిత్రక కట్టడంగా నిలుస్తోంది. కూటమి జట్టు కట్టిన తరుణంలో కొండారెడ్డి బురుజుపై జెండా ఎగరేసేది ఎవరో అని స్థానికంగా ఆసక్తి నెలకొంది.

గేట్​ వే ఆఫ్ రాయలసీమ- కర్నూలు బురుజుపై జెండా ఎగరేసేదెవరో?
గేట్​ వే ఆఫ్ రాయలసీమ- కర్నూలు బురుజుపై జెండా ఎగరేసేదెవరో?

Lok Sabha Elections in Kurnool Constituency : కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎన్నికైన చరిత్ర ఆయనది. రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగానూ పని చేశారు కోట్ల విజయభాస్కర్​ రెడ్డి. తొలిసారి 1977లో ఆరవ లోక్‌సభకు ఎన్నికవగా, మధ్యలో 8 వ లోక్‌సభకు మినహా 12వ లోక్‌సభ వరకు వరుసగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీనియర్ ముఖ్య నేతలు ఎంతో మంది కర్నూలు కేరాఫ్​గా రాజకీయాల్లో కొనసాగారు.

కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం (Kurnool Lok Sabha Constituency) 1952లో ఏర్పడింది. తొలి నుంచి ఇది జనరల్‌ కేటగిరీలోనే ఉంది. 2009 పునర్విభజనలో వీటి సంఖ్యలో మార్పు లేకున్నా డోన్ స్థానంలో నూతనంగా అవిర్భవించిన మంత్రాలయం నియోజకవర్గం వచ్చి చేరింది.

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు

  1. కర్నూలు
  2. కోడుమూరు(ఎస్సీ)
  3. ఎమ్మిగనూరు
  4. ఆదోని
  5. పత్తికొండ
  6. మంత్రాలయం
  7. ఆలూరు

ఓటర్ల వివరాలు

  • మొత్తం ఓటర్లు 16,93,597
  • పురుషులు 8,39,033
  • మహిళలు 8,54,327
  • ట్రాన్స్‌జెండర్‌ 237

1952లో జరిగిన తొలి ఎన్నికల్లో హెచ్. సీతారాంరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. దివంగత కోట్ల విజయభాస్కరరెడ్డి ఆరుసార్లు గెలిచారు. ఆయన కుమారుడు, కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి మూడుసార్లు విజయం సాధించారు. 1984లో ఏరాసు అయ్యపురెడ్డి, 1999 కేఈ కృష్ణమూర్తి టీడీపీ అభ్యర్థులుగా రెండు పర్యాయాలు కోట్ల విజయభాస్కరరెడ్డి మీద గెలుపొందారు.

kurnool_loksabha

ఇప్పటివరకు 16సార్లు జరిగి ఎన్నికల్లో 12సార్లు కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించగా, తెలుగుదేశం రెండు స్లార్లు, స్వతంత్రులు ఒకసారి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒకసారి విజయం సాధించాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాశ్‌రెడ్డిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి డా.సంజీవ్‌ కుమార్‌ విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి బీవై రామయ్య, టీడీపీ నుంచి బస్తిపాటి నాగరాజు (పంచలింగాల నాగరాజు) పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ నుంచి పీజీ రామ్‌పుల్లయ్య యాదవ్‌ బరిలో నిలిచారు.

గడిచిన ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు

  • 1952: హెచ్‌సీతారామిరెడ్డి (కాంగ్రెస్)
  • 1957: ఉస్మాన్ అలీఖాన్ (కాంగ్రెస్)
  • 1962: యశోదారెడ్డి (కాంగ్రెస్)
  • 1967: గాదిలింగన్న గౌడ్ (స్వత్రంత్ర)
  • 1971: కోదండరామిరెడ్డి (కాంగ్రెస్)
  • 1977: కోట్ల విజయభాస్కర్‌రెడ్డి (కాంగ్రెస్)
  • 1980: కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి (కాంగ్రెస్)
  • 1984: ఏరాసు అయ్యపురెడ్డి (టీడీపీ)

గత ఎన్నికల్లో విజేతలు - సమీప ప్రత్యర్థులు

  • 1989: కోట్ల విజయభాస్కర్‌రెడ్డి (కాంగ్రెస్) - ఈరాసు అయ్యపురెడ్డి (టీడీపీ)
  • 1991: కోట్ల విజయభాస్కర్‌రెడ్డి (కాంగ్రెస్) - ఎస్​.వి. సుబ్బారెడ్డి (టీడీపీ)
  • 1994: కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి (కాంగ్రెస్) - ఎస్​.వి. సుబ్బారెడ్డి (టీడీపీ)
  • 1996: కోట్ల విజయభాస్కర్‌రెడ్డి (కాంగ్రెస్) - కే.ఈ. కృష్ణమూర్తి (టీడీపీ​)
  • 1999: కేఈ క్రిష్ణమూర్తి (టీడీపీ) - కోట్ల విజయభాస్కర్​ రెడ్డి (కాంగ్రెస్​)
  • 2004: కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి (కాంగ్రెస్) - కే.ఈ. కృష్ణమూర్తి (టీడీపీ​)
  • 2009: కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి (కాంగ్రెస్) - బీ.టీ. నాయుడు (టీడీపీ​)
  • 2014: బుట్టా రేణుక (వైఎస్సార్సీపీ) - బీ.టీ. నాయుడు (టీడీపీ​)
  • 2019: డా.సంజీవ్‌కుమార్‌ (వైఎస్సార్సీపీ) - కోట్ల జయసూర్య ప్రకాశ్​ రెడ్డి (టీడీపీ)

ABOUT THE AUTHOR

...view details