ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జగనన్న ముద్దుల దండయాత్ర మళ్లీ షురూ- ఈ సారి ఎంపిక చేసిన వారికి మాత్రమే! - ap politics

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 7:33 PM IST

CM Jagan's kisses on the bus trip : గతంలో జగన్​ పర్యటన అంటేనే హడలిపోయిన సాధారణ ప్రజానీకం నేడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తోంది. 'అప్పుడు జగన్​కు జనం అవసరం లేకుండా పోయింది.. ఇపుడు జనానికి జగన్​ అవసరం లేకుండా పోయింది' అన్నట్లుగా తుస్సుమంటోంది జగనన్న బస్సు యాత్ర. అధికారంలో ఉన్నన్నాళ్లు వద్దనుకున్న జనం ఇప్పుడు ముద్దొస్తున్నారు. యథాప్రకారం యాత్రలో ముద్దుల పర్వం కొనసాగుతోంది.

cm_jagan_kiss
cm_jagan_kiss

CM Jagan's kisses on the bus trip : మీకు గుర్తుందా! సరిగ్గా ఐదేళ్ల కిందట జగన్​ ప్రచారంలో ముద్దు సీన్లు? మళ్లీ ఇప్పుడు అవే సీన్లు రిపీట్​ అవుతున్నాయి. ప్రతిపక్ష నాయకుడి హోదాలో జనంలో తిరిగిన జగన్​ కనిపించిన ప్రతి ఒక్కరి నెత్తిపై చేయి పెట్టి అదిమి నుదుటిపై ముద్దు పెట్టుకోవడం తెలిసిందే. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల పండుగ సందర్భంగా తిరిగి అవే సీన్లు పునరావృతమవుతున్నాయి. అయితే, ఈ సారి ఆ ముద్దులు అందరికీ కాదు.. ఎంపిక చేసిన కొందరికి మాత్రమే!

'అన్నొస్తే అన్నీ కష్టాలే' - గాల్లో వెళ్లే సీఎం కోసం రోడ్లపై ప్రజలకు అవస్థలు

ఎన్నికల సన్నాహాల్లో ముందుగా 'సిద్ధం' అని పేరెట్టుకున్న జగన్​.. తాజాగా రూటు మార్చి 'మేమంతా సిద్ధం' అంటున్నారు. సిద్ధం అంటే సింగిల్​గా ఉందనుకున్నారో లేక 'మేం ఎక్కడా?' అని ఎవరైనా నిలదీశారో గానీ చివరికి మేమంతా అనేశారు. మళ్లీ 'మనమంతా సిద్ధం' అని అంటారేమో!? ఎన్నికల నోటిఫికేషన్​ రావడంతో కడప జిల్లా ఇడుపుల పాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు బస్సుయాత్ర చేపట్టారు. అందులో భాగంగా పలు ప్రాంతాల్లో జగన్​ సభలు నిర్వహిస్తున్నారు.

Black Colour Dress Not Allowed to CM Sabha : 'సీఎం జగన్ సభ'.. హ్యాండ్ బ్యాగ్​, బ్లాక్​ డ్రెస్​కు​ అనుమతి నిరాకరణ

ఆర్టీసీ బస్సులు పెట్టి, వందల కోట్లు ఖర్చు వెదజల్లి జగన్​ సభలకు జనాన్ని తరలించినా.. ప్రస్తుతం బస్సు యాత్ర జనం లేక తుస్సుమంటోంది. జగన్​ చేపట్టిన బస్సుయాత్రకు కర్నూలు జిల్లాలో స్పందన కరవైంది. జనం లేక వెలవెలబోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతున్నాయి. మరో వైపు బస్సుకే పరిమితమవుతున్న జగన్​ జగంలోకి వెళ్లేందుకు సాహసించడం లేదు. భద్రతా కారణాల సాకు చూపిస్తూ బస్సు దిగి బయటకు రావడంలేదు. ఈ క్రమంలో అధికారులు ఎంపిక చేసిన కొద్ది మంది ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు మాత్రమే జగన్​ను కలిసే అవకాశం కల్పిస్తుండగా.. వారిపై జగన్​ ముద్దుల వర్షం కురిపిస్తున్నారు.

Arrangements for CM Sabha ఈ సారి అమలాపురం చెట్లు, వీధులు..! సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లలో అధికారులు

సీఎం పర్యటిస్తున్నారంటే అభివృద్ధి పనులు ప్రారంభిస్తారనో, కొత్తగా పథకాలు ప్రకటిస్తారనో ప్రజలు సంతోషిస్తారు. కానీ, జగన్ వస్తున్నారంటే సామాన్య ప్రజలతో పాటు అధికారులు బెంబేలెత్తిపోయారు. రోడ్లకు అడ్డంగా బారికేడ్లు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు, ఆంక్షలతో వాహనదారులకు పట్టపగలు చుక్కలు కనిపించేవి. అంగన్వాడీలు, డ్వాక్రా మహిళలు, ఒప్పంద ఉద్యోగులపై ఎంతో ఒత్తిడి ఉండేది. కానీ, ఇప్పుడు ఆ ఒత్తిడి లేకపోవడంతో ప్రతి ఒక్కరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.

పరదాల మాటున ప్రచారం :ఐదేళ్ల పాటు జనానికి దూరంగా ఉన్న జగన్​ ఎన్నికల వేళ అదే వైఖరి పాటిస్తున్నారు. ప్రజలకు దూరంగా ఉంటూ పరదాల మాటున ప్రచారం సాగిస్తున్నారు. గతంలో జగన్​ పర్యటన అంటేనే హడలిపోయిన జనం.. ఎన్నికల కోడ్​ పుణ్యమా అని ఊపిరి పీల్చుకుంటున్నారు. అప్పుడు జగన్​కు జనం అవసరం లేకుండాపోయింది ఇపుడు జనానికి జగన్​ అవసరం లేకుండా పోయింది.

CM Tour Tress Cuts: బాబోయ్ సీఎం​ జగన్​ పర్యటన.. హడలెత్తిపోతున్న జనం

ABOUT THE AUTHOR

...view details