Black Colour Dress Not Allowed to CM Sabha : 'సీఎం జగన్ సభ'.. హ్యాండ్ బ్యాగ్​, బ్లాక్​ డ్రెస్​కు​ అనుమతి నిరాకరణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2023, 4:09 PM IST

thumbnail

Black Colour Dress Not Allowed to CM Sabha : ముఖ్యమంత్రి జగన్ పర్యటన అంటేనే.. సామాన్యులు హడలిపోతున్నారు. పర్యటన ఏర్పాట్లలో అధికారుల అత్యుత్సాహం ప్రజల పాలిట శాపంలా మారుతోంది. ట్రాఫిక్ ఆంక్షల కారణంగా రోజువారీ పనులకు వెళ్లే వారితో పాటు పాఠశాల విద్యార్థులు సైతం ఇబ్బంది పడుతున్నారు. మరో వైపు రహదారుల వెంట  పచ్చని చెట్లు తొలగిస్తుండగా ఏళ్ల నాటి వృక్షాలు నేలకూలుతున్నాయి. సీఎం పర్యటన అనగానే ఈ వ్యవహారమంతా సర్వసాధారణం కాగా.. తాజాగా చిత్తూరు జిల్లా నగిరిలో ముఖ్యమంత్రి పర్యటనలో పోలీసుల అత్యుత్సాహం చూపించారు. 

జగనన్న విద్యాదీవెన పథకం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన పలువురిని లోపలకు పంపలేదు. నల్లదుస్తులతో వచ్చిన వారికి ప్రవేశం లేదంటూ అడ్డుకున్నారు. బురఖాతో వచ్చిన మహిళలను సైతం పోలీసులు అనుమతించకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడ్డారు. కార్యక్రమానికి వచ్చిన వాళ్లు ఎక్కడికి వెళ్లాలో తెలియక.. బయట ఎండలో గంటల తరబడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ మహిళతో పాటు విద్యాశాఖలో పనిచేసే ఉద్యోగి బురఖా ధరించి ఉందని పోలీసులు వెనక్కి పంపడం గమనార్హం. హ్యాండ్ బ్యాగ్​లో పెట్టుకుందామంటే.. దానిని కూడా అనుమతించడం లేదని మహిళా ఉద్యోగి వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.