ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కుప్పంలో హంద్రీ-నీవా జలాలను విడుదల చేసిన సీఎం జగన్‌

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 26, 2024, 7:13 PM IST

CM Jagan Release Krishna River Water to Kuppam: సీఎం జనగ్ చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించారు. హంద్రీ-నీవా జలాలను విడుదల చేసిన జగన్‌ జల పూజలు చేశారు. 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నీటిని తరలించామని జగన్ వెల్లడించారు. చిత్తూరు జిల్లా పరిధిలో జన సమీకరణ కోసం 800 ఆర్టీసీ బస్సులను సీఎం సభకు తరలించారు. వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Etv BharatCM Jagan Release Krishna River Water to Kuppam
Etv BharatCM Jagan Release Krishna River Water to Kuppam

CM Jagan Release Krishna Water to Kuppam: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి తరలించామని సీఎం జగన్‌ అన్నారు. హంద్రీ-నీవా జలాలను విడుదల చేసిన జగన్‌ జల పూజలు చేశారు. అనంతరం కుప్పం బహిరంగసభలో పాల్గొన్నారు. 2 లక్షల మందికి ప్రజలకు మంచినీరు, సాగునీరు అందించాలన్న లక్ష్యంతో పనులు పూర్తి చేసినట్లు జగన్‌ చెప్పారు. కుప్పం నియోజకవర్గ ప్రజల కల సాకారం చేసినట్లు పేర్కొన్నారు. 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నీటిని తరలించామని జగన్ వెల్లడించారు. చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించే రోజు అవుతుందని తెలిపారు.

తాను గతంలో 2022 సెప్టెంబర్ బహిరంగ సభలో ఇచ్చిన మాట ప్రకారం, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. తద్వారా కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో సుమారు 110 చెరువులకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. అదేవిధంగా మరో రెండు రిజర్వాయర్ల పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. గుడిపల్లి, శాంతిపురంలో రెండు రిజర్వాయర్లను నిర్మిస్తామని పేర్కొన్నారు. తద్వారా మరో ఐదు వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు ఉపయోగపడుతాయని సీఎం జగన్ పేర్కొన్నారు.

కుప్పంలో హంద్రీ-నీవా జలాలను విడుదల చేసిన సీఎం జగన్‌

CM Jagan Review Meeting: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ.. పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశం! ఎన్నికలకు సిద్దంగా ఉండాలని పిలుపు..

ఐదు సంవత్సరాలలో 30 కిలోమీటర్లు మాత్రమే:హంద్రీ-నీవా జలాలపై సీఎం జగన్ తన ప్రసంగంలో అవాస్తవాలను చెప్పారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి (Amarnath Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంకు హంద్రీనీవా నీళ్లు తెస్తున్నట్లు సీఎం బూటకపు మాటలు చెప్పారన్నారు. గత ప్రభుత్వంలోనే 630 కిలోమీటర్ల మేరకూ కాలువలు తవ్వి నీళ్లు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ ఐదేళ్ల కాలంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం 30 కిలోమీటర్ల కాలువలు తవ్వేందుకు సమయం దొరకలేదా అంటూ విమర్శించారు. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో సీఎం జగన్ జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు. కుప్పంకు వైఎస్సార్సీపీ ఏదో చేస్తున్నట్లు పేపర్లో ప్రకటనలే అంటూ ఎద్దేవా చేశారు.

బస్సులు లేక సామాన్యుల ఇక్కట్లు: సీఎం జగన్‌ కుప్పం పర్యటనతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. చిత్తూరు జిల్లా పరిధిలో జన సమీకరణ కోసం 800 ఆర్టీసీ బస్సులను (RTC buses) సీఎం సభకు తరలించారు. కళాశాలలు, పాఠశాలలకు అనధికారిక సెలవును అధికారులు ప్రకటించారు. విద్యాసంస్థల బస్సులను జన సమీకరణ కోసం వైఎస్సార్సీపీ నేతలు వినియోగిస్తున్నారు. గుండుశెట్టిపల్లె సమీపంలో జాతీయ రహదారి పక్కన బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో ఆంక్షలు విధించారు. పలమనేరు- కృష్ణగిరి జాతీయ రహదారిపై (Krishnagiri National Highway) వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.

అనారోగ్యంతో ఉన్నవారికి చేదోడుగా నిలిచేందుకే 'జగనన్న ఆరోగ్య సురక్ష': సీఎం జగన్​

ABOUT THE AUTHOR

...view details