అనారోగ్యంతో ఉన్నవారికి చేదోడుగా నిలిచేందుకే 'జగనన్న ఆరోగ్య సురక్ష': సీఎం జగన్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2023, 5:24 PM IST

thumbnail

CM Jagan Review Meeting On Jagananna Arogya Suraksha: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై... ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్సులో అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్షకు మంత్రి విడదల రజని, సీఎస్, వైద్యారోగ్యశాఖ, ఆర్ధిక, గ్రామవార్డు సచివాలయ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్షలో భాగంగా జగనన్న సురక్ష క్యాంపుల విస్తృతిని పెంచాలని సీఎం అధికారులకు  సూచించారు.

 ఆరోగ్య సురక్ష క్యాంపులకు వచ్చే వారందరికీ ఔషధాలను ఇవ్వాలని పేర్కొన్నారు. ఆయా  జబ్బుల ఆధారంగా... సంబంధిత ఆస్పత్రులకు రిఫర్ చేయాల్సిందిగా... సీఎం ఆదేశించారు. క్యాంపుల్లో కొన్ని చోట్ల ఔషధాల కొరత, వైద్యారోగ్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్న ఘటనలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఒక కుటుంబంలో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వారు పూర్తిగా కొలుకునే వరకూ ప్రభుత్వమే చేదోడుగా నిలవడమే జగనన్న ఆరోగ్య సురక్ష ఉద్దేశమని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయకుండా... అందరికీ వైద్య సేవలు అందేలా కృషి చేయాలని సీఎం సూచించారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.