Jaipur International Film Festival : 16వ 'జైపుర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్'(జె.ఐ.ఎఫ్.ఎఫ్) పురస్కారాల్లో తెలుగు సినిమాలు అదరగొట్టాయి. నటి పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన 'మంగళవారం'(Mangalavaram Movie) నాలుగు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. నటసింహం బాలయ్య నటించిన 'భగవంత్ కేసరి'(Bhagavanth Kesari), కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' (Bimbisara) చిత్రాలు కూడా పలు అవార్డులకు ఎంపికయ్యాయి. 'మంగళవారం'లోని నటనకు గాను పాయల్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు రాగా, 'భగవంత్ కేసరి'లో నటనకు గాను కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ పలు అవార్డులు అందుకోనున్నారు.
కాగా, 82 దేశాల నుంచి 2,971 చిత్రాలు ఈ ఏడాది అవార్డులకు పోటీపడ్డాయి. వీటిలో 67 దేశాలకు చెందిన 326 సినిమాలు నామినేట్ అయ్యాయి. తుది జాబితా తాజాగా విడుదలైంది. ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు జైపుర్ వేదికగా జరగనున్న ఈ వేడుక గ్రాండ్‌గా జరగనుంది. ఈ కార్యక్రమంలో విజేతలకు అవార్డులు అందజేస్తారు.
విజేతల వివరాలివీ
'మంగళవారం' చిత్రానికి వచ్చిన పురస్కారాలివీ..
ఉత్తమ నటి : పాయల్ రాజ్‌పుత్
బెస్ట్ ఎడిటింగ్: గుళ్లపల్లి మాధవ్ కుమార్
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్: ముదస్సర్ మహ్మద్
బెస్ట్ సౌండ్ డిజైన్: ఎం. ఆర్. రాజా కృష్ణన్
ఆనర్ ఆఫ్ ది సినిమా అవార్డు
- అర్జున్ రాంపాల్: భగవంత్ కేసరి
- కాజల్ అగర్వాల్: భగవంత్ కేసరి
- ప్రకాశ్ రాజ్: బింబిసార
- అనుపమ్ ఖేర్: కార్తికేయ-2
ఫీచర్ ఫిల్మ్ : జె.ఐ.ఎఫ్.ఎఫ్. ఇండియన్ పనోరమ
- ఉత్తమ నటి: శ్రీలీల (భగవంత్ కేసరి)
- గోల్డెన్ క్యామెల్ అవార్డ్ ఫర్ బెస్ట్ డైరెక్టర్:వశిష్ఠ (బింబిసార)
- రెడ్ రోజ్ అవార్డ్ ఫర్ బెస్ట్ రిలీజ్‌డ్ ఫిల్మ్: బింబిసార
- బెస్ట్ మేకప్, హెయిర్ స్టైలింగ్: బింబిసార
కాగా, బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'భగవంత్ కేసరి' దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ టాక్‌తో రూ.100కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకుంది. ఇక ఫాంటసీ యాక్షన్ చిత్రం బింబిసారలో కల్యాణ్‌రామ్ బింబిసారుడు, దేవదత్తుడు అనే రెండు విభిన్న పాత్రలు పోషించి కెరీర్లోనే భారీ హిట్‌ను అందుకున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్లో వచ్చిన 'మంగవారం' కూడా మంచి సక్సెస్‌ను అందుకుంది. నందిత శ్వేత, దివ్య పిళ్లై, కీలక పాత్రలు పోషించారు.
ప్రభాస్ 'కల్కి'లో మరో ఇద్దరు టాలీవుడ్ హీరోలు - స్క్రీన్‌ను షేక్ చేసే రోల్స్‌లో!
మెగాస్టార్ సరసన హనీరోజ్ - ఏ సినిమాలో అంటే?