Amazon Prime Subscription Plans : ప్రస్తుతం ఉన్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో అమెజాన్ ప్రైమ్ ఒకటి. మంచి కంటెంట్ ఉండటం, వివిధ భాషల్లో అందుబాటులో ఉండటం, ప్రైమ్ యూజర్లకు అనేక అదనపు బెనిఫిట్స్ కల్పించడమే ఈ ఆదరణకు కారణం. మరి మీరు కూడా ఓటీటీ లవర్సా! అయితే మరెందుకు ఆలస్యం అమెజాన్ ప్రైమ్ అందిస్తున్న బెస్ట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్‌పై ఓ లుక్కేద్దాం రండి.
అమెజాన్ ప్రైమ్‌లో 4 రకాల ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఒక మంత్లీ ప్లాన్, ఒక త్రీమంత్స్ ప్లాన్, రెండు వార్షిక ప్లాన్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- Amazon Prime 299 Plan :ఈ అమెజాన్ ప్రైమ్ మంత్లీ ప్లాన్ ధర రూ.299. దీని వ్యాలిడిటీ ఒక నెల రోజులు.
- Amazon Prime 599 Plan :ఇది ఒక త్రైమాసిక ప్లాన్. దీని ధర రూ.599.
- Amazon Prime 799 Plan :ఇది అమెజాన్ ప్రైమ్ వార్షిక ప్లాన్. ఈ అమెజాన్ ప్రైమ్ లైట్ ఎడిషన్ ధర రూ.799.
- Amazon Prime 1499 Plan :ఇది అమెజాన్ ప్రైమ్ అందిస్తున్న బెస్ట్ ఇయర్లీ ప్లాన్. ఈ ప్లాన్ ధర రూ.1499. ఈ ప్లాన్ తీసుకున్న యూజర్లకు పే-ఆన్-డెలివరీ ఫెసిలిటీ ఉంటుంది. మొదటిసారి అమెజాన్ సభ్యత్వం తీసుకున్నవాళ్లకు 30 రోజుల ఫ్రీ ట్రయల్ కూడా లభిస్తుంది.
సబ్ స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలి ?
అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ప్లాన్‌ను ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. గూగుల్ పే, ఫోన్ పే లాంటి యూపీఐల ద్వారా; క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, అమెజాన్ పేల ద్వారా కొనుగోలు చేయవచ్చు.