మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణం కుంగిపోవడం కేసీఆర్ పనితనానికి నిదర్శనం : ఉత్తమ్​కుమార్​రెడ్డి

By ETV Bharat Telangana Desk

Published : Nov 5, 2023, 1:58 PM IST

thumbnail

Uttam Kumar Reddy Fires On CM KCR : మేడిగడ్డ బ్యారేజీ వంతెన పిల్లర్ల కుంగుబాటుపై బీఆర్‌ఎస్‌ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్‌ ఆరోపణలను మరింత పెంచింది. కేంద్ర ప్రభుత్వం విజిలెన్స్‌ కమిటీతో విచారణ జరిపించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇప్పటికే డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పనితనానికి నిదర్శనం మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణం కుంగిపోవడమని.. సరైన భూ పరీక్షలు లేకుండానే రూ.వేల కోట్లతో ప్రాజెక్టును నిర్మించారని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఉత్తమ్ సమక్షంలో టీడీపీ సీనియర్ నాయకులు సతీష్, హనుమంతరావు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుల చేరికతో కోదాడలో కాంగ్రెస్ బలం పుంజుకుందన్నారు. కేసీఆర్ అవినీతి పాలనను రాష్ట్ర ప్రజలు తరిమికొడతారని ఉత్తమ్ వెల్లడించారు.

''60 ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ  కట్టిన నాగార్జున సాగర్ డ్యామ్​ నుంచి ఎడమ కాలువలో 12 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. కేసీఆర్ కొత్తగా కట్టిన మేడిగడ్డ బ్యారేజీ మాత్రం కుంగిపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్​లో అవినీతి జరిగింది.''- ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.