Raid on Ice cream Company: ఈ ఫ్యాక్టరీ చూస్తే మళ్లీ ఐస్​క్రీమ్ ముట్టుకోరు..!

By

Published : Apr 15, 2023, 6:14 PM IST

thumbnail

The Food Officials Raid on Ice cream Company: అనుమతులు లేకుండా ఐస్ క్రీమ్ తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యాలు పాడు చేస్తున్న ఐస్ క్రీమ్ కంపెనీపై పుడ్ సేఫ్టీ అధికారులు, బాలానగర్ ఎస్ఓటి, కూకట్‌పల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా రసాయనాలు, సింథటిక్ ఆహారపు రంగు కలిపి ఐస్​క్రీమ్​ తయారుచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ ఐస్​ క్రీమ్​ తయారీ అను ప్రొజన్ ఫుడ్ కంపెనీ సంబంధించినదిగా తెలుసుకున్నారు. దీంతో ఆ కంపెనీని అధికారులు సీజ్‌ చేశారు. రూ.15 లక్షలు విలువ చేసే ఐస్ క్రీమ్ తయారీ సామాగ్రిని, పలు రకాల ఐస్ క్రీములను సీజ్ చేశారు. అనుమతి లేకుండా అపరిశుభ్రమైన వాతావరణంలో వీటిని తయారుచేస్తున్న నిర్వాహకుడు రమేష్​ను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి రసాయనాలు వాడిన ఐస్ క్రీమ్‌లను తినడం వల్ల గొంతు, అజీర్తి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల రసాయనాలు కలిపిన ఐస్​ క్రీమ్​లు తినేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సలహాలు ఇచ్చారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.