భాగ్యనగరంలో మూసీ మురికి వదిలించేదెలా? - కలుషిత నీటి నుంచి మంచినీటిగా మారేదెప్పుడు?

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2024, 9:25 PM IST

thumbnail

Prathidhwani on Musi River : అనగనగా ఓ చారిత్రకనగరం. 400 ఏళ్లకు పైగా చరిత్ర, సుసంపన్నమైన వారసత్వ సంపదలున్న అద్భుత నాగరిక చిహ్నం. ఆ నగరానికి పాపిడి బిల్లలా శోభనివ్వడమే కాదు ఏళ్ల పాటు స్వచ్ఛమైన ప్రవాహంతో అవసరాలకు పెద్దదిక్కుగా నిలిచింది ఓ జీవనది. కానీ ఇదంతా గతం! వర్తమానంలో ఇక్కడి చారిత్రక, వారసత్వ సంపదలు ప్రమాదంలో పడినట్లే, ఆ జీవనది కూడాజీవచ్ఛవమై కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.  

Debate on Musi River : వందల ఏళ్ల ప్రస్థానానికి మౌనసాక్షిగా నిలిచిన పరివాహమంతా కాలుష్యకాసారమై ముక్కుపుటాలు అదరగొడుతోంది. ఇదంతా భాగ్యనగరం, ఈ నగరం నడి మధ్యన సాగే మూసీ దుస్థితి గురించే. మరి ఇకనైనా ఆ మురికి వదిలించాలంటే ఏం చేయాలి? ప్రస్తుతం మూసీ పరివాహం ఏ పరిస్థితుల్లో ఉంది? ప్రభుత్వం దీని ప్రక్షాళనపై  పూర్తి స్థాయిలో దృష్టి పెడితే అసలు ఎక్కడి నుంచి చర్యలు మొదలు పెట్టాలి ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.