'బీఆర్​ఎస్​ నేతలు ఇంకా తామే అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారు​ - కాళేశ్వరం అవినీతి బయటపెడతాం'

By ETV Bharat Telangana Team

Published : Dec 17, 2023, 3:25 PM IST

thumbnail

MLC Jeevan Reddy Fires on BRS Leaders : మాజీ మంత్రి హరీశ్​రావు పీవీ నర్సింహారావుపై ప్రేమ ఒలకపోయడం ఆశ్చర్యంగా ఉందని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి ఎద్దేవా చేశారు. పీవీ సీఎం, ప్రధానమంత్రిగా పని చేసి ఆ పదవులకే వన్నె తెచ్చారని కొనియాడారు. పీవీ అంతిమ యాత్ర హైదరాబాద్​లోనే చేపట్టాలని కుటుంబసభ్యులే కోరారని అన్నారు. అన్ని లాంఛనాలతో గౌరవ వందనాలతో చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు బీఆర్​ఎస్​ నేతలు విమర్శలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు.

Jeevan Reddy Speak on Kaleshwaram Project : ఉద్యమ పార్టీ అని చెప్పుకునే బీఆర్​ఎస్​ నేతలు ఆంధ్రప్రదేశ్​ అక్రమంగా నీటిని తరలించుకుపోతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారని జీవన్​ రెడ్డి ప్రశ్నించారు. స్వార్థ పూరిత రాజకీయాలతో భద్రాచలానికి చెందిన 7 మండలాలను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సీలేరు పవర్​ ప్రాజెక్టు కోల్పోవడానికి కేసీఆర్​ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్​ చేశారు. ఐటీఐఆర్​ తేవడంలోనూ ఫెయిలయ్యారని విమర్శించారు. ఈ క్రమంలోనే ఇంకా తామే అధికారంలో ఉన్నామని బీఆర్​ఎస్​ నేతలు భావిస్తున్నారన్న ఆయన, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయటపెడతామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.