గులుగుడు గులుగుడే, గుద్దుడు గుద్దుడే - అందుకే హ్యాట్రిక్​పై అంత ధీమాగా ఉన్నాం : మంత్రి కేటీఆర్

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2023, 10:08 PM IST

Updated : Nov 10, 2023, 10:59 PM IST

thumbnail

Minister KTR Exclusive Interview : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. మిగతా పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్‌.. ప్రచారంలోనూ ముందంజలో ఉంది. రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగురవేయడానికి.. ఆ పార్టీ శ్రేణులు తహతహలాడుతున్నారు. అలాగే సీఎం కేసీఆర్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించి.. మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తమకు పోటీ కాంగ్రెస్​తోనేనని.. బీజేపీ ఖాతా కూడా తెరవదని బీఆర్​ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు పేర్కొన్నారు. తమకు గతంలో వచ్చిన 88 కన్నా ఒకటి, రెండు సీట్లు ఎక్కువే వస్తాయని.. వెయ్యి శాతం మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను గెలవాలని అనుకుంటోందని.. బీఆర్​ఎస్ తెలంగాణను గెలిపించాలని కోరుకుంటోందన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో సాధించింది చాలా ఉందని.. సాధించాల్సింది ఇంకా ఉందని.. అందుకే కేసీఆర్​ను సీఎంగా కొనసాగించాలని ఈటీవీ భారత్ ముఖాముఖిలో మంత్రి కేటీఆర్ కోరారు.

Last Updated : Nov 10, 2023, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.