KTR Playing Football Video Viral : పుట్​బాల్​ ఆడుతూ గోల్​ కొట్టిన కేటీఆర్​.. వీడియో వైరల్​

By ETV Bharat Telangana Team

Published : Sep 30, 2023, 2:07 PM IST

thumbnail

KTR Playing Football Video Viral   : ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగానే 20వ వార్డులో ఉన్న పుట్​బాల్​ టర్ఫ్​కోర్టును ప్రారంభించారు. అనంతరం పుట్​బాల్​ ఆడే చిన్నారులతో ముచ్చటించారు. వారితో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. కాసేపు పుట్​బాల్​ కోర్టులో సరదాగా గడిపారు. 

పుట్​బాల్​ ఆడుతూ.. మొదటి గోల్​ కొట్టినప్పుడు గోల్​ పోస్టులోకి గోల్​ వెళ్లకపోయేసరికి అసహనానికి గురయ్యారు. పక్కనే ఉన్న మంత్రి అజయ్​ కుమార్​తో మీ వల్లే గోల్​ కొట్టలేకపోయాను అంటూ జోక్ చేశారు. వెంటనే మరో గోల్​ చేయడానికి సిద్ధమై.. ఈసారి గోల్​ గురిచూసి కొట్టారు. మైదానంలో ఆడే క్రీడాకారుల్లాగా.. గోల్​ కొట్టగానే ఆనందంతో మురిసిపోయారు. అంతకు ముందు చిన్నారి క్రీడాకారులను పరిచయం చేసుకుంటూ తాను చిన్నప్పటి నుంచి పుట్​బాల్​ లెజెండ్​ మెస్సీ ఫ్యాన్​ అంటూ తనకు క్రీడలపై ఉన్న అభిమానాన్ని చూపించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.