హైదరాబాద్‌లో గ్యాస్‌ పైప్‌లైన్ లీక్, భారీగా ఎగసిపడిన మంటలు

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2023, 3:44 PM IST

thumbnail

Gas Pipe Leak in Hyderabad : ప్రమాదం.. ఎటు నుంచైనా రావొచ్చు.. ఏ క్షణంలోనైనా జరగొచ్చు. దాని నుంచి తప్పించు కోవాలంటే అప్రమత్తంగా ఉండటం ఒక్కటే మార్గం. అయినా ప్రమాదాల నుంచి బయటపడతాం అన్న నమ్మకం లేదు. ఇటీవల జరుగుతున్న గ్యాస్ ప్రమాదాలు అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. కొంతకాలంగా జరుగుతున్న గ్యాస్ ప్రమాదాల్లో పెద్దసంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి.

Gas Pipe Leak In Kompally Main Road : తాజాగా హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌- కొంపల్లి ప్రధాన రహదారి పక్కన రోడ్డు విస్తరణకు జేసీబీతో గుంత తవ్వుతుండగా.. గ్యాస్ పైప్ లైన్ పగిలింది. దీంతో అక్కడ గ్యాస్ లీకేజీ కావడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు భయంతో పరుగులు తీశారు. పక్కనే ఇద్దరు వ్యక్తులు సిగరెట్ తాగుతుండగా.. వారికి మంటలు అంటుకుని తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసి.. గ్యాస్ ఏజెన్సీకి సమాచారం ఇవ్వగా పైప్ లైన్‌ మరమ్మతులు చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.