Drunk Lady Hulchul Hyderabad Viral Video : ఫ్రెండ్స్​తో కలిసి మందేసింది.. పోలీసులకు చుక్కలు చూపించింది.. చివరకు!

By ETV Bharat Telangana Team

Published : Oct 10, 2023, 12:13 PM IST

thumbnail

Drunk Lady Hulchul Hyderabad Viral Video  : సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో మద్యం మత్తులో ఓ యువతి పోలీసులతో వాగ్వాదానికి దిగింది. దాదాపు రెండు గంటల పాటు ప్రధాన రహదారిపై నానా హంగామా సృష్టించింది. నా ఇష్టం.. నా పైసల్తో నేను తాగినా.. నీకేంది అంటూ పోలీసులపై విరుచుకుపడింది. అసభ్య పదజాలంతో వారిని దూషించింది. చివరకు పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకుని పోలీస్​ స్టేషన్​కు తరలించారు. 

Drunk Lady Argues With Police Hyderabad :  ఓ ఈవెంట్‌కు వెళ్తున్న యువతి మిత్రులతో కలిసి మద్యం సేవించి కారును వేగంగా డ్రైవ్ చేసింది. జూబ్లీ బస్ స్టేషన్ వద్ద వేగంగా కారు నడపడం చూసి అనుమానం కలిగిన ట్రాఫిక్ పోలీసులు.. ఆ వాహనాన్ని రెండు కిలో మీటర్లు వెంబడించారు. చివరకు ఆమెను ఆపేందుకు యత్నించిన కానిస్టేబుల్​ను యువతి కారుతో ఢీ కొట్టి వెళ్లిపోయింది. చివరకు తాడ్​బండ్ సమీపంలో కారును ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో యువతి వివాదానికి దిగడంతో దాదాపు రెండు గంటల పాటు బోయిన్​పల్లి మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. యువతిపై పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుతో పాటు న్యూసెన్స్ కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.