జర్నీ మధ్యలో మందుకొట్టి డ్రైవర్ పరార్​.. బస్సును నడిపిన ప్రయాణికుడు ​

By

Published : Feb 17, 2023, 3:46 PM IST

thumbnail

మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ యాక్సిడెంట్ చేసి, జర్నీ మధ్యలోనే దిగి పారిపోగా.. బస్సులోని ఓ వ్యక్తి తోటి ప్రయాణికుల్ని సురక్షితంగా గమ్యస్థానం చేర్చాడు. ఉత్తర్​ప్రదేశ్ మథురలో గురువారం జరిగిందీ ఘటన. ఆగ్రా నుంచి మథురకు వెళ్తున్న బస్సును.. మద్యం సేవించిన డ్రైవర్ నిర్లక్ష్యంగా తోలుతూ డివైడర్​కు ఢీకొట్టాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. బస్సులో డ్రైవింగ్ వచ్చిన కపిల్​ కుమార్ అనే యువకుడు ఉన్నాడు. అతడు టెక్నీషియన్ అయినప్పటికీ బస్సు నడపడం కూడా వచ్చు. తోటి ప్రయాణికులు కపిల్​ను బస్సు నడపమని కోరగా.. అతడు జాగ్రత్తగా వారందరినీ మథుర చేర్చాడు. ఈ ఘటనపై రవాణా శాఖ అధికారులు స్పందించారు. మద్యం సేవించి బస్సు నడిపిన డ్రైవర్​పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.