దేశస్థాయిలోనే కామారెడ్డి పేరు మారుమోగుతోంది : ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Dec 22, 2023, 4:07 PM IST

thumbnail

BJP MLA Venkata Ramana Reddy Speech : కార్యకర్తల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి అన్నారు. పట్టణంలోని రాజారెడ్డి గార్డెన్​లో కామారెడ్డి నియోజకవర్గం బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యకర్తల కృషితోనే తన గెలుపు సాధ్యమైందని పేర్కొన్నారు. దేశ స్థాయిలోనే కామారెడ్డి పేరు మారుమోగుతోందని, ఇద్దరు సీఎం అభ్యర్థులని ఓడించడంలో కామారెడ్డి ప్రజలు, కార్యకర్తలే కీలకమన్నారు.  

MLA KV Ramana Reddy about kamareddy : రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం రెట్టింపుగా పని చేయాలని ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయం అంటే డబ్బు, మద్యం అనుకునే వారికి అది అపోహలేనని బీజేపీ కార్యకర్తలు, కామారెడ్డి ప్రజలు నిరూపించారని చెప్పారు. ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకు బీజేపీ పార్టీ పని చేస్తోందని అన్నారు. ప్రభుత్వ సహకారంతో ప్రజల సమస్యలని పరిష్కారిస్తానని, దీనికి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రజల తరఫున ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. 2028లో బీజేపీ పార్టీ అధికారంలోని రావడం ఖాయమని జోస్యం చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.