ఎన్నికల ప్రచారంలో బీజేపీ, బీఆర్ఎ​స్ నాయకుల మధ్య ఘర్షణ

By ETV Bharat Telangana Team

Published : Nov 13, 2023, 5:33 PM IST

thumbnail

BJP MLA Candidate Bhukya Sangeetha Allegations on BRS : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎ​స్ నాయకులు ఓడిపోతారనే భయంతోనే.. బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని డోర్నకల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్య సంగీత ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా గోప తండ శివారు లావుడియా తండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో తనపై బీఆర్ఎస్ సర్పంచ్ లక్ష్మి, ఆమె భర్త వంశీ దాడికి పాల్పడ్డారని భూక్య సంగీత అన్నారు.  ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తండాలో శాంతియుతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ నృత్యాలు చేస్తున్న క్రమంలో సర్పంచి భర్త అకారణంగా తమపై దాడికి పాల్పడ్డారన్నారు.

ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రోత్సాహంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని భూక్య సంగీత ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు తన అనుచరుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించేలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమపై దాడికి పాల్పడిన వంశీపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. దాడులకు పాల్పడుతున్న బీఆర్ఎస్ నాయకులకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని ఆమె కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.