ఫేమస్​ 'మిల్క్​ బండార్'​- వేడివేడి పాలకు ఫుల్​ డిమాండ్​- 75ఏళ్లుగా పొయ్యి అలానే!

By ETV Bharat Telugu Team

Published : Dec 4, 2023, 3:47 PM IST

Updated : Dec 5, 2023, 8:57 AM IST

thumbnail

75 Years Milk Shop In Jodhpur : రాజస్థాన్​లోని జోధ్​పుర్​లో ఓ పాల దుకాణం గత 75 సంవత్సరాలుగా నడుస్తోంది. ప్రాచీన పద్దతిలోనే పాలను వేడి చేసి ఇక్కడ అమ్ముతున్నారు. తరతరాలుగా నడుస్తున్న ఈ దుకాణానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. విశేషం ఏమిటంటే పాలను వేడి చేయడం కోసం 1949లో అగ్గి ముట్టించిన పొయ్యి ఇప్పటి వరకు వెలుగుతూనే ఉందని షాపు యజమాని తెలిపారు.

"సోజతీ గేటు సమీపంలో మా తాత 1949లో 'మిల్క్ బండార్​' పేరుతో ఈ షాపును ప్రారంభించారు. పాలను వేడి చేయడం కోసం ముట్టించిన ఈ పొయ్యి ఇంకా వెలుగుతూనే ఉంది. రోజుకు సుమారు 22 నుంచి 24 గంటల పాటు దుకాణం నడుస్తోంది. పాత పద్ధతిలో బొగ్గును, కలపను మండించి పాలను వేడి చేస్తున్నాం. దాదాపు 75 సంవత్సరాలుగా ఇలానే పాలను వేడి చేస్తున్నాం. ప్రస్తుతం షాపును నిర్వహిస్తున్న మేం మూడో తరానికి చెందినవాళ్లం" అని వికుల్ నికుబ్​ తెలిపాడు.

Last Updated : Dec 5, 2023, 8:57 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.