ETV Bharat / sukhibhava

యుక్త వ్యాయామం.. భావి ఆరోగ్యానికి మార్గం!

Exercises for young: యుక్తవయసులో చేసే వ్యాయామాలు భావి ఆరోగ్యానికి మార్గం చూపుతాయి. యుక్తవయసు పిల్లలు రోజుకు గంట, అంతకన్నా ఎక్కువ సేపు శారీరక శ్రమ చేయాలన్నది నిపుణుల సూచన.

exercises for young
వ్యాయామం
author img

By

Published : Feb 11, 2022, 8:17 AM IST

Exercises for young: యుక్తవయసులో చాలామంది వ్యాయామాన్ని పెద్దగా పట్టించుకోరు. చిన్న వయసే కదా వ్యాయామం చేస్తే ఎంత? చేయకపోతే ఎంత? అని అనుకుంటుంటారు. నిజానికి యుక్తవయసులో చేసే వ్యాయామాలు భావి ఆరోగ్యానికి మార్గం చూపుతాయి. యుక్తవయసు పిల్లలు రోజుకు గంట, అంతకన్నా ఎక్కువ సేపు శారీరక శ్రమ చేయాలన్నది నిపుణుల సూచన. వీటిల్లో ఎక్కువభాగం ఏరోబిక్‌ వ్యాయామాలు.. అంటే గుండె వేగాన్ని పెంచే సైకిల్‌ తొక్కటం, డ్యాన్స్‌, పరుగు వంటివి ఉండేలా చూసుకోవాలి. తర్వాత కొద్ది నిమిషాలు బరువులు ఎత్తటం, పుషప్స్‌, బిగుతైన రబ్బరు బ్యాండ్లను లాగటం వంటి బలాన్ని పెంచే వ్యాయామాలు చేయాలి. ఇవి కండరాలు బలోపేతం కావటానికి, జీవక్రియలు పుంజుకోవటానికి తోడ్పడతాయి. కావాలంటే ఇలాంటి వ్యాయామాలను ఇంట్లోనే చేసుకోవచ్చు. వీటికి ప్రత్యేకమైన పరికరాలేవీ అవసరం లేదు. జిమ్‌లకు వెళ్లాల్సిన పనిలేదు. వీటిల్లో ో

ఒక వ్యాయామం చేశాక కాస్త విశ్రాంతి తీసుకొని మరోటి చేయాలి. ఒకో వ్యాయామాన్ని ఎన్నిసార్లు చేయాలన్నది వీలును బట్టి నిర్ణయించుకోవాలి. క్రమంగా సంఖ్యను పెంచుకుంటూ రావాలి.

కూర్చొని వెనక్కు

  • నేల మీద కూర్చొని, మోకాళ్లు పైకి ఉండేలా కాళ్లను వంచాలి.
  • చేతులను ముందుకు తిన్నగా చాచాలి.
  • నెమ్మదిగా తల, భుజాలను లాగుతూ వెనక్కు వాలటానికి ప్రయత్నించాలి.
exercises for young
కూర్చొని వెనక్కు
  • చేతులు తిన్నగా, కడుపు బిగుతుగా ఉండేలా చూసుకోవాలి.
  • వీలైనంతవరకు వెనక్కు వాలాలి.
  • కాసేపు అలాగే ఉండి, నెమ్మదిగా యథాస్థితికి రావాలి.
  • 10-15 సార్లు ఇలాగే చేయాలి.
    exercises for young
    యుక్త వ్యాయామం

కుర్చీ గుంజీలు

  • వెనకాల కుర్చీ వేసుకొని, తిన్నగా నిల్చోవాలి.
  • చేతులను ముందుకు చాచాలి.
  • చేతులను వంచకుండా నెమ్మదిగా కుర్చీ మీద కూర్చోవటానికి ప్రయత్నించాలి.
  • పిరుదులు కుర్చీకి తాకకముందే ఆగాలి.
  • నెమ్మదిగా లేస్తూ, తిరిగి తిన్నగా నిల్చోవాలి.
  • 5-10 సార్లు ఇలాగే చేయాలి.
    exercises for young
    కుర్చీ గుంజీలు

సీతాకోకచిలుక శ్వాస

  • పాదాలు కాస్త ఎడంగా పెట్టి, తిన్నగా నిల్చోవాలి.
  • రెండు చేతులను పక్కలకు చాచాలి.
  • శ్వాసను వదులుతూ కుడి మోకాలిని పైకి లేపి, ఎడమ మణికట్టుతో తాకాలి.
  • శ్వాసను తీసుకుంటూ యథాస్థితికి రావాలి
exercises for young
సీతాకోకచిలుక శ్వాస
  • శ్వాసను వదులుతూ ఎడమ మోకాలిని పైకి లేపి, కుడి మణికట్టుతో తాకాలి.
  • శ్వాసను తీసుకుంటూ యథాస్థితికి రావాలి.
  • ఇలా 8-15 సార్లు చేయాలి.

ఇదీ చదవండి: Beauty Tips: చారడేసి కళ్ల కోసం.. మాయ చేసే మేకప్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.