పుదీనా టీ
పుదీనా... కప్పు నీటిలో నాలుగైదు పుదీనా ఆకులు వేసి మరిగించి, వడకట్టాలి. కాస్తంత తేనె కలిపి తాగి చూడండి. వేసవి గంజిలో కాస్త పల్చటి మజ్జిగ, చిటికెడు నల్ల ఉప్పు కలిపి తాగితే డీహైడ్రేషన్ సమస్య ఉండదు. శరీరానికి కావలసిన పోషకాలూ అందుతాయి. శరీరం, మెదడు, ప్రశాంతంగా మారతాయి. ఇది జీర్ణవ్యవస్థకూ సాంత్వన కలిగించి హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది.
గులాబీ టీ
గులాబీ టీ... ఈ పూలలోని తియ్యటి పరిమళాలు మీలోని ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మెదడుకు ప్రశాంతతను చేకూరుస్తాయి. తాజా/ఎండిన గులాబీ రేకలను నీటిలో మరిగించి గ్లాసులోకి వడ కట్టుకోవాలి. కాస్తంత తేనె కలిపి తాగితే సరి. చక్కగా నిద్ర పడుతుంది.
- ఇదీ చదవండి : ఇమ్యూనిటీని పెంచే పవర్ఫుల్ పానీయాలివే!