యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణపనులు తుది దశకు చేరుకున్నాయి. విష్ణు పుష్కరిణి పునరుధ్ధరణ, హరి హరుల రథశాలలు, మెట్ల దారి, ఉత్తరాన రక్షణగోడ, ఆలయ స్వాగత తోరణం, ఎస్కలేటర్, లిఫ్ట్, వాటర్ ఫాల్, కనుమ రహదారి విస్తరణ, వాహనాల మినీ పార్కింగ్ పనులు వచ్చే నెలఖరులోగా పూర్తి చేసేందుకు యాడా ప్రయత్నిస్తోంది.
పనులు పురోగతిపై ఎప్పటికప్పుడు సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తెలుసుకుంటున్నారు. కొవిడ్ కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు వెళ్లిపోవడం వల్ల నిర్మాణ పనుల్లో కొంత జాప్యం ఏర్పడుతోంది.
ఇదీ చూడండి: ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగని భూగర్భ డ్రైనేజీ నిర్మాణం