ETV Bharat / state

KTR Speech on Handloom : 'మళ్లీ చేనేత రుణాలు మాఫీ చేసే అంశాన్ని.. కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తాం'

author img

By

Published : Aug 12, 2023, 4:12 PM IST

Updated : Aug 12, 2023, 7:43 PM IST

KTR Speech on Handloom : నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నంత వరకూ... చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ పోదని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. కేంద్రంలో రాబోయే ప్రభుత్వంలో కేసీఆర్‌ కీలక పాత్ర పోషించాలంటే.. బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఎంపీలుగా గెలిపించాలని కోరారు. కేంద్రప్రభుత్వంలో కేసీఆర్‌ కీలక పాత్ర పోషిస్తేనే చేనేతకు మనుగడ అని కేటీఆర్ స్పష్టం చేశారు.

KTR visit to Yadadri Bhuvanagiri district
KTR inagruation handloom unit at Pochampally

KTR Speech on Handloom : యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. ఈ క్రమంలోనే భూదాన్‌ పోచంపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగానే పోచంపల్లిలో చేనేత కళాకారుడు భరత్‌ ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ యూనిట్‌ను కేటీఆర్ (KTR Inagruation Handloom Unit) ప్రారంభించారు. ఈ యూనిట్‌ ఏర్పాటు చేసిన భరత్ బృందానికి మంత్రి అభినందనలు తెలిపారు. చేనేతల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తోందని చెప్పారు.

KTR Fires at Central Government GST on Handloom : ఈ నేపథ్యంలోనే చేనేత నేతన్న విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నంత వరకూ... చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ పోదని ఆయన అన్నారు. కేంద్రంలో రాబోయే ప్రభుత్వంలో కేసీఆర్‌ కీలక పాత్ర పోషించాలంటే.. బీఆర్ఎస్‌ అభ్యర్థుల్ని ఎంపీలుగా గెలిపించాలని కోరారు. కనుముక్కుల గ్రామంలో మూతపడిన పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కును (Pochampally Handloom Park) రూ.12 కోట్లతో కొనుగోలు చేసి.. త్వరలో ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి.. నెలకు రూ.3,000 చొప్పున బ్యాంకు ఖాతాలో వేయనున్నట్లు కేటీఆర్ వివరించారు.

Handloom Declaration on August 7 : ఆగస్టు 7న చేనేత డిక్లరేషన్.. దిల్లీకి తరలుతున్న దేశవ్యాప్త చేనేత ప్రతినిధులు

చేనేత బీమా వయసు 75 ఏళ్లకు పెంచామని గుర్తు చేశారు. రూ.25,000 చేనేత హెల్త్‌ కార్డు అమలు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే కోకాపేటలో నేతన్నల భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. ఉప్పల్‌లో చేనేత కళారూపాల ప్రదర్శనశాలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. మళ్లీ చేనేత రుణమాఫీ చేసే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అమలు చేస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

"మోదీ ఉన్నన్ని రోజులు చేనేతపై 5 శాతం జీఎస్టీ పోదు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ఎంపీలను గెలిపించుకోవాలి. కేంద్రంలో కేసీఆర్‌ కీలక పాత్ర పోషిస్తేనే చేనేతకు మనుగడ. కనుముక్కుల గ్రామంలో మూతపడిన పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కు తెరిపిస్తాం. రూ.12 కోట్లతో కొనుగోలు చేసి తర్వలో ప్రారంభించబోతున్నాం. ప్రతి చేనేత కార్మికుడి వచ్చేనెల నుంచి ఖాతాలో రూ.3,000 వేయనున్నాం. మగ్గం ఆధునీకరణకు చేనేత మగ్గం కార్యక్రమం. మాది చేతల ప్రభుత్వం.. చేనేత ప్రభుత్వం. మళ్లీ చేనేత రుణాలు మాఫీ చేసే అంశాన్ని కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తాం. పోచంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి జరిగింది. మళ్లీ భువనగిరి గడ్డపై గులాబీ జెండా ఎగరాలి." - కేటీఆర్, మంత్రి

Pochampally silk sarees : ఉద్యోగం వదలి.. చేనేత వైపు కదిలాడు.. ఎందరికో ఆదర్శంగా నిలిచాడు
సమైక్య పాలనలో చేనేత రంగం కుదేలయిందని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం.. చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. తద్వారా నేడు ఈ రంగం లాభదాయకంగా మారిందని జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, తదితరులు పాల్గొన్నారు.

KTR Speech on Handloom మళ్లీ చేనేత రుణాలు మాఫీ చేసే అంశాన్ని కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తాం

Handloom Entrepreneur : కష్టపడితే కానిదేముందని నిరూపిస్తున్న మహిళ

Netannaku Cheyutha scheme: 'నేతన్నకు చేయూత'.. సెప్టెంబర్ 1 నుంచి నమోదు ప్రక్రియ

Last Updated :Aug 12, 2023, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.