వికారాబాద్ జిల్లా పరిగి వికెబి పరిగి టిటిడిపి టి-టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ పర్యటించారు. పరిగి మండలంలోని రంగాపూర్ గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులను పరామర్శించారు. సంక్షేమ పథకాల పేరుతో రైతులను సీఎం కేసీఆర్ మోసం చేశాడని విమర్శించారు. రైతుల కళ్లలో నీళ్లు తెప్పించారన్నారు. ఆ 15 మంది అన్నదాతల ఆత్మహత్యలే రాష్టానికి శాపంగా మారాయని ఆవేదన చెందారు. కనీసం చనిపోయిన రైతుల కుటుంబాలను ఓదార్చే పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి లేరన్నారు.
అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కవ వర్షాలు కురుస్తాయని కేసీఆర్‌కు ముందే తెలుసన్నారు. నీళ్లు నిధులు నియమకాలు అని నిర్లక్ష్య పాలన చేస్తున్నారని విమర్శించారు. ధనిక రాష్టాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్‌దేనని ఎద్దేవా చేశారు. కమీషన్ల కోసం పథకాలను తెచ్చి రైతులను., రాష్ట్రాన్ని మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. రైతుకిచ్చే ఐదు లక్షల ఎక్స్గ్రేషియను రైతు బంధుగా మార్చాడని ధ్వజమెత్తారు. రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రయ్య పాల్గొన్నారు.
ఇవీ చదవండి: కరోనా ప్రభావంతో రద్దయిన పాలమూరు కురుమూర్తి స్వామి జాతర!