ETV Bharat / state

సిద్దిపేట జిల్లాలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

author img

By

Published : Jan 23, 2020, 11:02 PM IST

సిద్దిపేట జిల్లా గౌరారం రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటనలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో కండక్టర్ శ్రీనివాస్ శర్మతోపాటు పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

RTC bus, tipper ji in Siddipet district .. One's situation is poisonous
సిద్దిపేట జిల్లాలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ.. ఒకరి పరిస్థితి విషమం


సిద్దిపేట జిల్లా గౌరారం రాజీవ్ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటనలో బస్సు డ్రైవర్​కు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి సిద్ధిపేట వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు.. గౌరారం వద్ద ముందు వెళ్తున్న టిప్పర్ వాహనాన్ని ఢీ కొట్టింది.

సిద్దిపేట జిల్లాలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

ఈ ప్రమాదంలో ఆర్టీసీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. క్యాబిన్​లో ఇరుక్కుపోయిన డ్రైవర్ రాజిరెడ్డిని స్థానికులు బయటకు తీశారు. ప్రమాదంలో కండక్టర్ శ్రీనివాస్ శర్మకతోపాటు పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం డ్రైవర్​ను హైదరాబాద్​కు తరలించారు.

ఇవీ చూడండి: ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

Intro:tg_srd_16_23_bus_accident_av_ts10054
సిద్దిపేట జిల్లా గౌరారం రాజీవ్ రహదారిపై పై దృష్టి లో ఘోర ప్రమాదం తప్పింది ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్న ఘటనలో బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయిBody:సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం రాజీవ్ రహదారిపై తృటిలో ఘోర ప్రమాదం తప్పింది హైదరాబాద్ నుంచి సిద్ధిపేట వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు గౌరారం వద్ద ముందు వెళ్తున్న టిప్పర్ వాహనాన్ని ఢీ కొట్టింది ప్రమాదంలో ఆర్టీసీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది దీంతో డ్రైవర్ రాజిరెడ్డి క్యాబిన్లో ఇరుక్కుపోవడం తో స్థానికుల సహాయంతో బయటకు తీశారు ప్రమాదం లో కండక్టర్ శ్రీనివాస్ శర్మ తో పాటు పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి డ్రైవర్ రాజిరెడ్డి ఇ కండక్టర్ శ్రీనివాస శర్మ లను 108 వాహనంలో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రాథమిక చికిత్స అనంతరం డ్రైవర్ మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. ముందు వెళ్తున్న టిప్పర్ వాహనం అకస్మాత్తుగా కుడివైపు తిరగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందిConclusion:ప్రమాదంలో గాయపడిన కండక్టర్ శ్రీనివాస్ శర్మ జిల్లా పరిషత్ చైర్మన్ రోజా శర్మ బంధువు కావడంతో హుటాహుటిన గజ్వేల్ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.