Ghattaraghi Bhagamma devotee Sasikala: పట్టువిడవని సంకల్పం ఉంటే ప్రకృతే ముందుకు నడిపిస్తుందనటానికి నిదర్శంగా నిలుస్తోంది.. ఈ మహాభక్తురాలు. 55 ఏళ్ల ప్రాయంలో పొర్లుదండాలు పెడుతూ.. రాష్ట్రాలు దాటుతున్న ఆమె భక్తి సర్వత్రా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కర్ణాటక నుంచి వచ్చి జహీరాబాద్‌లోని ధనుశ్రీ గ్రామంలో శశికళ స్థిరపడ్డారు. చిన్నతనం నుంచి కర్ణాటకలోని కలబురగి జిల్లాలోని ఘట్టరాగి భాగమ్మ తల్లిని శశికళ దర్శించుకుంటోంది.
కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారికి భక్తురాలిగా మారిన ఆమె.. కరోనా నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని వైరస్ విజృంభణ వేళ ఘట్టరాగి భాగమ్మను మొక్కుకుంది. కరోనా నుంచి ప్రజలను కాపాడితే పొర్లుదండాలతో వచ్చి మొక్కులు చెల్లించుకుంటానని వేడుకుంది. కరోనా తగ్గిపోవటంతో.. అమ్మవారికి మొక్కు చెల్లించాలని నిర్ణయించుకున్న శశికళ.. ఈ నెల 11న యాత్ర మొదలుపెట్టారు. జహీరాబాద్‌లోని భవానీ ఆలయం నుంచి పొర్లుదండాల సేవను ప్రారంభించారు.
జహీరాబాద్ నుంచి బీదర్, హుమ్నాబాద్, హల్లిఖేడ్, కమల్‌పూర్ మీదుగా కర్ణాటకలోని కలబురగి నగరానికి పొర్లుదండాలు పెడుతూ చేరుకుంది. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆమె చేస్తున్న యాత్రతో.. పెద్దఎత్తున భక్తులు సైతం ఆమె వెంట నడుస్తున్నారు. భజనలు చేస్తూ, కీర్తనలు ఆలపిస్తూ శశికళ యాత్రలో భాగస్వాములవుతున్నారు. ఘట్టరాగి ఆలయానికి ప్రస్తుతం 65 కిలోమీటర్ల దూరం ఉన్న శశికళ.... రెండుమూడ్రోజుల్లో అమ్మవారిని చేరుకోనున్నారు.
"మాది కర్ణాటక రాష్టం.. నేను జహీరాబాద్‌లోని ధనుశ్రీ గ్రామంలో వచ్చి స్థిర పడ్డా.. కరోన సమయంలో కరోనా తగ్గాలని.. ప్రజలందరూ బాగుండాలని ఆ ఘటరాగి అమ్మవారిని మొక్కుకున్న.. ఆ తరువాత అమ్మవారు నా కలలోకి వచ్చి కరోనా తగ్గించాను అని చెప్పారు. అమ్మదయ వలన కరోనా తగ్గింది. అందుకే నేను 300 కిలోమీటర్లు ఇలా పోర్లు దండాలతో ఘట్టరాగి అమ్మవారిని దర్శనానికి వెళ్తున్న.. ఈ నెల 11న యాత్ర మొదలుపెట్టా.. ఇప్పుడు అనేక మంది భక్తులు నావెంట నడిచి దేవుని కీర్తనలు, భజనలు చేస్తూ నన్ను అనుచరిస్తున్నారు. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది." -శశికళ, భక్తురాలు
ఇవీ చదవండి: