ETV Bharat / state

Shilpa Case: శిల్ప దంపతుల బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

author img

By

Published : Dec 18, 2021, 4:31 AM IST

Shilpa Case:శిల్ప దంపతుల బెయిల్ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా వేసింది ఉప్పరపల్లి కోర్టు. అధిక వడ్డీలు, స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులంటూ కోట్లు వసూళ్లకు వారిపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఓ కేసులో బెయిల్ లభించగా.. మరో రెండు కేసుల్లో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌లపై విచారణ వాయిదా పడింది.

Shilpa chowdary couple's bail petition
శిల్ప దంపతుల బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

Shilpa Case: అధికవడ్డీల పేరుతో మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్ప దంపతుల బెయిల్ పిటీషన్ న్యాయస్థానం మంగళవారానికి వాయిదా వేసింది. గండిపేట్ సిగ్నేచర్ విల్లాస్‌లో నివసించే శిల్పాచౌదరి, శ్రీనివాస ప్రసాద్ దంపతులపై గత నెలలో నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు శిల్పాచౌదరి వసూళ్లకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించేందుకు మూడుసార్లు కస్టడీకి తీసుకున్నారు.

ఫోన్​ నంబర్ల ఆధారంగా దర్యాప్తు

Shilpa Chowdary Cheating Case: దంపతుల చరవాణుల్లో లభించిన ఫోన్ నెంబర్లను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. వీరిపై నమోదైన మూడు కేసుల్లో ఒక కేసులో భార్యభర్తలకు ఉప్పర్‌పల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. మరో రెండు కేసుల్లో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌లపై శుక్రవారం విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. అధిక వడ్డీలు, స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో నిందితురాలు శిల్ప మహిళల నుంచి తీసుకున్న కోట్లాది రూపాయలు ఎక్కడ దాచారనేది ప్రశ్నార్థకంగా మారింది. దంపతుల బ్యాంకు ఖాతాల్లో, లాకర్లలోనూ ఎటువంటి పత్రాలు, నగదు లభించకపోవటం పోలీసులను విస్మయానికి గురిచేసింది. మరోవైపు మరికొందరు బాధితులు పోలీసు అధికారులను కలసి శిల్పపై మౌఖికంగా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.