ETV Bharat / state

Vogue Italia : వోగ్‌ ఇటాలియాలో 'మనోళ్ల బొమ్మ'.. సరదాగా తీసిన ఫొటోకు గుర్తింపు

author img

By

Published : Jul 10, 2023, 10:41 AM IST

Sircilla Student Photo in Vogue Italia : అవకాశం రావాలే కానీ ఆకాశాన్ని అందుకుంటామని నిరూపిస్తున్నారీ విద్యార్థినిలు. మేమెందులోనూ తక్కువ కాదంటూ మహిళలు పెద్దగా లేని ఫోటోగ్రఫీ రంగంలోనూ సత్తా చాటుతున్నారు. తాజాగా ఓ గిరిజన యువతి తీసిన ఛాయా చిత్రం అంతర్జాతీయ ఫ్యాషన్‌ మ్యాగజైన్‌ వోగ్‌ ఇటాలియాలో ప్రచురితం కావటమే దీనికి నిదర్శనం. రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేసిన గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థినులు అద్భుత ప్రదర్శనతో అబ్బురపరుస్తున్నారు.

Sircilla Student Photo in Vogue Italia
Sircilla Student Photo in Vogue Italia

ఫైన్​ఆర్ట్స్‌లో సత్తా చాటుతున్న గిరిజన గురుకుల విద్యార్థినులు

Photo Captured by Sircilla Student in Vogue Italia : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో.. రాష్ట్రంలోనే మొదటి ఫైన్‌ఆర్ట్స్‌ ఉమెన్స్‌ కళాశాల ఏర్పాటైంది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో జీఎన్​టీయూకు అనుబంధంగా ఏర్పాటైన ఈ కాలేజీ.. యువతుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. జనరల్‌ డిగ్రీ తరహాలోనే మూడేళ్ల విద్యావిధానంలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఫొటో డిజిటల్‌ ఇమేజింగ్‌, ఇంటీరియర్‌ డిజైనింగ్‌ వంటి మూడు కోర్సులను ప్రవేశపెట్టారు.

  • This beautiful picture was picked up by Vogue Italia, a popular Fashion Magazine

    Guess who clicked it?

    Mamatha Guguloth, a young student of Photography Telangana Tribal Welfare Fine Arts Academy, Siricilla 👏

    My compliments to Mamatha and her teachers on this recognition pic.twitter.com/SVKCPUpKtR

    — KTR (@KTRBRS) July 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Sircilla Fine Arts Students : 2021-22 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభమైన ఈ కాలేజీలో తొలి ఏడాది అన్ని జిల్లాల నుంచి 70 మంది విద్యార్థినిలు అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ ఏడాది 96 మంది అడ్మిషన్లు పొందారు. వాస్తవానికి ఫొటోగ్రఫీ శిక్షణ కోసం ఆడపిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు అంగీకరించరు. వారిని ఒప్పించి శిక్షణ పొందుతున్న యువతులు అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకురావటంతో తల్లిదండ్రులు సైతం హర్షిస్తున్నారు. తండాలోని గిరిజన మహిళను కెమెరాలో బంధించిన గుగులోతు మౌనిక ఫొటో.. వోగ్‌ ఇటాలియా మ్యాగజైన్‌లో ప్రచురితమైంది. మరో యువతి సిద్ధ మౌనిక నేషనల్‌ వర్క్‌షాప్‌లో బంగారు పతకాన్ని సాధించడం తోటి వారిలో స్ఫూర్తిని రగిలించిందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Fine Arts Academy Course In Womens Degree College : సాధారణ డిగ్రీ మాదిరిగానే ఈ కోర్సులు చేసిన వారికి సైతం ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు ఉంటాయి. టెక్ట్స్‌టైల్ పరిశ్రమకు మారుపేరుగా ఉన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ చొరవతో ఫైన్​ఆర్ట్స్ కళాశాల ఏర్పాటైంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ కళాశాలలో ప్రయోగాత్మకంగా బోధిస్తున్నట్లు అధ్యాపకులు తెలిపారు. విద్యార్థులు ఆయా కోర్సుల్లో నిష్ణాతులైతే స్వయం ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని చెబుతున్నారు.

Telangana Tribal Welfare Residential Fine Arts Academy : వృత్తి విద్య అంటేనే ప్రయోగాత్మక చదువు. అందులో ఏమాత్రం అశ్రద్ధ వహించినా విద్యార్థి జీవితకాలం వృథా అవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సుమారు 50 లక్షలకు పైగా విలువైన అధునాతన పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. నాలుగంతస్తుల భవనంలో ఏర్పాటు చేసిన ఈ కళాశాలలో ప్రతి కోర్సులో డిజిటల్‌ తరగతి గదులు, అధునాతన సౌకర్యాలతో ల్యాబ్‌, గ్రంథాలయం ఏర్పాటు చేశారు. అనుభవమున్న ఎనిమిది మంది అధ్యాపకులతో తరగతులు నిర్వహిస్తున్నారు.

  • Guguloth Mamatha, a student of II yr Photography touched the international soil with her https://t.co/OAbGmF0vdj image captured by her is now selected for PhotoVogue in VOGUE ITALIA - one of the most acclaimed magazines in the world of fashion and creative work. pic.twitter.com/jzpX2UaQNB

    — TTWREI Society (@TTWREISociety) July 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

శ్రద్ధ పెడితే ఉజ్వల భవిష్యత్ : మహిళలు ఫొటోగ్రఫీలో రాణించడం చాలా అరుదు కాబట్టి ఈ కోర్సుల్లో చేరిన వారికి సినిమా రంగం, ప్రీ వెడ్డింగ్‌ స్టూడియోలు, తదితర రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయి. ప్రైవేటు కళాశాలల్లో లక్షలాది రూపాయలు వెచ్చించలేని పేద కుటుంబాలకు ఇది సువర్ణావకాశం. కొంచెం శ్రద్ధ పెడితే ఈ రంగంలో ఉజ్వల భవిష్యత్‌ నిర్మించుకోవచ్చని అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.