రాష్ట్రంలో కరోనా(Corona third wave in Telangana) మరోసారి విలయతాండవం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే నల్గొండ జిల్లాలో విద్యార్థులపై తన పంజా(Corona cases in Nalgonda district) విసరడం మొదలుపెట్టింది. ఇప్పటికే 15 మంది విద్యార్థులు.. ఇద్దరు ఉపాధ్యాయులకు సోకిన మహమ్మారి(students tested corona positive) తాజాగా మరో ఏడుగురిపై తన ప్రతాపం చూపించింది.
మరో ఏడుగురికి కరోనా..
నల్గొండ జిల్లాలో విద్యార్థులకు కరోనా సోకుతున్న తరుణంలో.. కొండమల్లేపల్లి ఎస్టీ బాలికల పాఠశాలలో కొవిడ్ పరీక్షలు(Corona tests in nalgonda schools) నిర్వహించారు. మొత్తం 423 మందికి పరీక్షలు చేయగా.. అందులో ఇవాళ ఏడుగురికి కరోనా పాజిటివ్(Students tested covid positive)గా నిర్ధారణ అయింది. బుధవారం రోజున ఎనిమిది విద్యార్థినులు, ఇద్దరు ఉపాధ్యాయులు మహమ్మారి బారిన పడ్డారు.
విద్యార్థుల్లో గుబులు..
ఇప్పుడిప్పుడే తాము పాఠశాలకు హాజరవుతున్న క్రమంలో.. కరోనా సోకడం(Corona cases in nalgonda district) విద్యార్థుల్లో గుబులు రేపుతోంది. ఈ ఏడాది కూడా తాము ఇళ్లలోనే ఉండి చదవాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఆన్లైన్ తరగతుల్లో సరిగ్గా అర్థంగాక పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నామని వాపోతున్నారు. బడుల్లో ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా.. తాము ఎంత అప్రమత్తంగా ఉన్నా మహమ్మారి సోకుతోందని ఆవేదన చెందుతున్నారు.
తల్లిదండ్రుల ఆందోళన..
మరోవైపు.. తమ పిల్లలను పాఠశాలలకు పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇప్పుడిప్పుడే బడిబాట పడుతున్న పిల్లలు మళ్లీ ఇంట్లోనే చదువుకోవాల్సిన దుస్థితి వస్తుందేమోనని ఆందోళన పడుతున్నారు. పాఠశాలల యాజమాన్యం కరోనా నిబంధనలు(corona guide lines) పాటిస్తున్నా.. పిల్లలు అప్రమత్తంగా ఉన్నా.. మహమ్మారి ఎక్కణ్నుంచి వస్తుందో అర్థంకావడం లేదని వాపోతున్నారు. మూడో దశ వచ్చేసిందేమోనని భయపడుతున్నారు.