ETV Bharat / state

65 ఏళ్ల వయసులో జీవనపోరాటం.. కొడుకుల కష్టాలు కడతేర్చేందుకు ఆరాటం..

author img

By

Published : May 2, 2022, 5:31 AM IST

పిల్లల చిన్నతనంలోనే.. ఆమెకు భర్త దూరమయ్యాడు. కటిక పేదరికంలోనూ కాయాకష్టం చేసి కన్నపేగులను కంటికిరెప్పలా కాపాడి పెద్దచేసింది. స్తోమత ఉన్నంతవరకు చదివించి ప్రయోజకులను చేసింది ఆ అమ్మ. ఇంతచేసినా ఆ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. కుమారులిద్దరు అనారోగ్యం బారినపడడంతో... వారికి వైద్యం చేయించేందుకు అష్టకష్టాలుపడుతోంది ఆ మాతృమూర్తి.

65 years mothers fighting with problems for sons at mothkuru
65 years mothers fighting with problems for sons at mothkuru

65 ఏళ్ల వయసులో జీవనపోరాటం.. కొడుకుల కష్టాలు కడతేర్చేందుకు ఆరాటం..

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు సుందరయ్య కాలనీకి చెందిన లక్ష్మమ్మ దీనగాథ వింటే ఎవరి గుండెయినా బరువెక్కాల్సిందే. ముగ్గురు మగపిల్లలు, ఓ ఆడపిల్ల... ఆ ఇంట సంతానం. పిల్లలు చిన్నవయసులోనే భర్త దూరమవడంతో... కూలీకెళ్లి వారిని కనురెప్పలా సాకింది. ప్రయోజకులై చేతికందివచ్చిన సమయంలో.. విధి ఆ కుటుంబాన్ని వెక్కిరించింది. పెద్దకుమారుడికి కాలికైన గాయం కాస్త పెద్దదై... మంచానికే పరిమితమయ్యాడు. రెండో కుమారుడు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకోగా.... మూడో కుమారుడు ఒత్తిడితో మతిస్థిమితం కోల్పొయాడు. ఇలా పిల్లలంతా తలో సమస్యతో బాధపడుతుంటే ఆ తల్లి వేదన వర్ణణాతీతం.

కుమారులను కంటికిరెప్పలా కాపాడేందుకు 65 ఏళ్ల వయసులోనూ ఆ మాతృమూర్తి జీవనపోరాటం చేస్తూనే ఉంది. అప్పటివరకు ఆ ఇంటికి ఆసరాగా ఉన్న తనయులిద్దరు అనారోగ్యం బారిన పడటం మరింత కుంగదీసింది. వారికి వైద్యం చేయించలేక... ఇల్లు వెళ్లదీయలేక లక్ష్మమ్మ పుట్టెడు బాధలుపడుతోంది. మనసున్న మారాజులెవరైనా ఆదుకోవాలని చేతులెత్తి వేడుకుంటోంది.

పెద్దకొడుకు వైద్యానికి నెలకు 3 వేలు ఖర్చవుతోంది. అందినకాడికి అప్పు తీసుకొచ్చి ఖర్చుచేసినప్పటికీ...ఆ తల్లికి తలకు మించిన భారంగా మారింది. అప్పులు చెల్లించలేక...వైద్యానికి డబ్బుల్లేక సాయం కోసం ఎదురుచూస్తోంది. కుమారులకు వైద్యం చేయించేందుకు ప్రభుత్వం చేయూతనివ్వాలని ఆ పేదతల్లి కోరుతోంది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.