'సింగరేణిని ముంచింది కాంగ్రెస్​ - లాభాల బాట పట్టించింది బీఆర్​ఎస్'​

author img

By ETV Bharat Telangana Desk

Published : Nov 8, 2023, 5:10 PM IST

Updated : Nov 8, 2023, 6:43 PM IST

BRS Public Meeting at Bellampalli

BRS Public Meeting at Bellampalli : కాంగ్రెస్​ అసమర్థత వల్లే సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ వాటాను కోల్పోయామని బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్​ అన్నారు. పూర్తిగా సింగరేణిని ముంచింది కాంగ్రెస్​నే అని తెలిపారు. అప్పుల్లో ఉన్న బొగ్గు కంపెనీనీ.. బీఆర్​ఎస్​నే లాభాల్లోకి తీసుకువచ్చిందన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్​ పాల్గొని.. ప్రసంగించారు.

BRS Public Meeting at Bellampalli : సింగరేణిని ముంచింది కాంగ్రెస్​నే.. కాంగ్రెస్​ అసమర్థత వల్లే సింగరేణి(Singareni Collieries Company)లో వాటా కోల్పోయామని బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్​(CM KCR) ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్​ ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి.. 49 శాతం వాటాను వారికి కట్టబెట్టారని గుర్తు చేశారు. అప్పటి నుంచి అప్పుల్లోనే ఉన్న సింగరేణి.. బీఆర్​ఎస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే లాభాల బాట పట్టిందని తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో జరిగిన బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభ(BRS Praja Ashirvada Sabha)లో పాల్గొన్న సీఎం కేసీఆర్​.. సభను ఉద్దేశించి ప్రసంగించారు.

గత కాంగ్రెస్​ ప్రభుత్వం దళితులకు అన్యాయం చేసిందని సీఎం కేసీఆర్​ అన్నారు. రైతుబంధు కొనసాగాలంటే దుర్గం చిన్నయ్యను గెలిపించాలని బెల్లంపల్లి ఓటర్లను కోరారు. రైతుబంధు రూ.10వేలు నుంచి రూ.16 వేలకు పెరగాలంటే కచ్చితంగా బీఆర్​ఎస్​నే గెలవాలన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ గెలిపించకుండా వేరే పార్టీని గెలిపించి మోసపోతే.. గోసపడతామని సూచించారు. ప్రతి సింగరేణి కార్మికుడికి రూ.2.50 లక్షలు వస్తున్నాయని వివరించారు.

'బీఆర్​ఎస్​ పోరాటానికి భయపడే నాడు కాంగ్రెస్​ ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది'

"బీఆర్​ఎస్​ పుట్టిందే తెలంగాణ పౌరుల హక్కుల కోసం.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం. రాష్ట్రంలో దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు కానీ దళితులకు ఒక ప్రణాళికను ఏర్పాటు చేయలేదు. కేసీఆర్​ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో నినాదంతో ఉద్యమానికి వెళితే దిగొచ్చి తెలంగాణ ఇచ్చారు. సింగరేణిని ముంచింది కాంగ్రెస్​నే. 134 ఏళ్ల చరిత్ర ఉన్న కంపెనీ. 100 శాతం తెలంగాణకు ఉన్న కంపెనీని ఆనాటి కాంగ్రెస్​ పార్టీ నాయకుడు కేంద్రం దగ్గర డబ్బులు తెచ్చి.. కట్టలేక వారికి 49 శాతం వాటా ఇచ్చారు. కాంగ్రెస్​ హయాంలో సింగరేణి నష్టాల్లో నడిచేది.. బీఆర్​ఎస్​ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాభాలు వచ్చాయి." - కేసీఆర్​, బీఆర్​ఎస్​ అధినేత

BRS Praja Ashirvada Sabha at Bellampalli : భూవివాదాలు ఉండకూడనే ధరణి పోర్టల్​ను తీసుకువచ్చామని సీఎం కేసీఆర్​ తెలిపారు. కాంగ్రెస్​ హయాంలో లంచం ఇస్తేనే రిజిస్ట్రేషన్లు జరిగేవని ఆరోపించారు. ప్రస్తుతం ఎలాంటి లంచాలు ఇవ్వకుండానే అర్ధగంటలోనే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయన్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్​ నేతలు అంటున్నారని మండిపడ్డారు.

CM KCR Election Campaign : రైతులకు ఉపయోగపడే ధరణని తీసేస్తే రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోళ్ల డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ధరణి తీసేస్తే రైతులకు భూములపై ఉన్న హక్కులు పోతాయని ఆవేదన చెందారు. ఈ పోర్టల్​ను తీసేస్తే మళ్లీ దళారుల వ్యవస్థ వస్తోందని హెచ్చరించారు. అలాగే బీఆర్​ఎస్​ చేసిన అభివృద్ధిపై గ్రామాల్లో చర్చలు జరపాలని ప్రజలకు సూచించారు.

సింగరేణిని ముంచింది కాంగ్రెస్​ - లాభాల బాట పట్టించింది బీఆర్​ఎస్

'గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చాం- గిరిజనులు కానివారికీ త్వరలో పట్టాలు ఇస్తాం'

CM KCR Speech in BRS Public Meeting at Aleru : కాంగ్రెస్​ హయాంలో టపాసులు మాదిరి ట్రాన్స్​ఫార్మర్లు పేలుతుండేవి : సీఎం కేసీఆర్​

Last Updated :Nov 8, 2023, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.