కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో అనేక అవినీతి వ్యవహారాల్లో డాక్టర్ అలీమ్ ప్రమేయం ఉందని భాజపా దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు సోమిది వేణు ప్రసాద్ ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హెచ్ఆర్సీ, లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. మాతా శిశు సంక్షేమ కేంద్రంలో అడ్మినిస్ట్రేటర్‌గా విధులు నిర్వహిస్తున్న అలీమ్‌ను ప్రభుత్వం రక్షించాలని చూస్తోందని మండి పడ్డారు.
ఉద్యోగాలు లేక యువత బాధపడుతుంటే.. రిటైర్ అయిన ఉద్యోగికి సంక్షేమ కేంద్రంలో రూ. లక్షకు పైగా వేతనంతో ఉద్యోగం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. ఎంఐఎం నాయకులు, స్థానిక మంత్రుల అండదండలతో ఆయన తనపై ఉన్న ఆరోపణలను కప్పిపుచ్చుకుంటున్నారని ఆరోపించారు. జిల్లా అధికారులకు ఆయనపై చర్యలు తీసుకునే దైర్యం లేదని విమర్శించారు. ఫిర్యాదు చేసేటప్పుడు భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా మీడియా కన్వీనర్ కటకం లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఫీవర్ సర్వే: గ్రేటర్ పరిధిలో 50 వేల మందికి పైగా కొవిడ్ లక్షణాలు