హుజూరాబాద్(Huzurabad by election 2021) నుంచి భాజపా తరఫున అభ్యర్థిగా నిలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. తన పదవికి ఎందుకు రాజీనామా చేశారో ఇప్పటి వరకు ప్రజలకు చెప్పలేకపోయారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్(Telangana Planning Commission Vice President Vinod kumar) అన్నారు. సీఎం కేసీఆర్తో ఐదేళ్లుగా విభేదాలున్నాయని ఈటల చెప్పారని.. ఆ విభేదాలు వ్యక్తిగతంగా వచ్చినవా లేదా ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదని వచ్చాయా అన్నది చెప్పాలని డిమాండ్ చేశారు.
హుజూరాబాద్Huzurabad by election campaign 2021)లో పర్యటించిన వినోద్ కుమార్(Telangana Planning Commission Vice President Vinod kumar).. తెరాస అభ్యర్థికి మద్దతుగా ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం రాజీనామా చేస్తే ఆలోచించాలి గానీ.. వ్యక్తిగత సమస్యలతో రాజీనామా చేసిన ఈటల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ప్రజలకు వివరించారు. ఐదు నెలలుగా ప్రచారం చేస్తున్న ఈటల.. ఎక్కడ కూడా నియోజకవర్గ అభివృద్ధి ప్రస్తావన తీసుకురావడం లేదని వినోద్ అన్నారు.
"నేను ఎంపీగా ఉన్నప్పుడు రైల్వే లైన్ల కోసం ఎంతో శ్రమించాను. కరీంనగర్ జిల్లా అభివృద్ధికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో భాజపా చెప్పాలి. హుజూరాబాద్-జమ్మికుంట అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నియోజక వర్గ అభివృద్దికి ఎవరు కృషి చేస్తారో వారికే ఓటు వేయాలి. మిగతా విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు."
- వినోద్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు (Telangana Planning Commission Vice President Vinod kumar)