ETV Bharat / state

'ప్రిన్సిపలే కర్కశంతో కొట్టి చంపి బావిలో పడేశాడు'

author img

By

Published : Dec 19, 2019, 7:58 PM IST

Updated : Dec 19, 2019, 8:29 PM IST

రెండు రోజుల క్రితం తప్పిపోయి బావిలో దొరికిన జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల గురుకుల విద్యార్థి మృతి కేసులో బంధువులు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రిన్సిపలే కొట్టించి... చంపేసి బావిలో పడేశాడంటూ మృతుని సోదరి ఆరోపిస్తోంది. ఈ ఘటనపై స్పందించిన అధికారులు ప్రిన్సిపల్​ను సస్పెండ్​ చేసి... దర్యాప్తు ముమ్మరం చేశారు.

GURUKULA STUDENT DEAD BODY CASE UPDATES
GURUKULA STUDENT DEAD BODY CASE UPDATES

జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి మృతికి పాఠశాల ప్రిన్సిపలే కారణమని మృతుడి బంధువులు ఆందోళన నిర్వహించారు. బాలుని శరీరంపై గాయాలున్నట్లు, చెవుల నుంచి రక్తం వచ్చిందని మృతుడి సోదరి అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ప్రధానోపాధ్యాయునికి వ్యతిరేకంగా హాస్టల్లో ఉండే సమస్యలపై అజయ్​కుమార్​ ఫిర్యాదు చేశాడని... అందువల్లే తన సోదరుడిని ఉద్దేశపూర్వకంగా చంపి బావిలో పడేశారని సోదరి ఆరోపించారు.

తమకు న్యాయం చేయాలంటూ బంధువులు అంబేడ్కర్​ కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ ఘటనలో ప్రిన్సిపాల్​ను సస్పెండ్ చేసినట్లు గురుకుల రీజనల్ కో ఆర్డినేటర్ ఫ్లోరెన్స్ రాణి వెల్లడించారు. మృతుని కుటుంబంలో ఓ వ్యక్తికి అవుట్​సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తమవుతున్న అనుమానాలపై శవపరీక్ష తర్వాత స్పష్టత ఇస్తామన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కోన్నారు.

'ప్రిన్సిపలే కొట్టి చంపించి బావిలో పడేశారు...'

ఇవీచూడండి: విశ్రాంత అధికారులూ.. మీ సేవలు కావాలి

Intro:Tg_mbnr_02_19_student_dead_avb_ejs_ts10049
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న అజయ్ కుమార్ మృతికి పాఠశాల ప్రిన్సిపల్ కారణం అని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడి శరీరంపై గాయాలు ఉన్నట్లు, చెవుల నుండి రక్తం వచ్చినట్టు ఉంది అని మృతుడి సోదరి అన్నారు. అజయ్ పాఠశాలలో చాలా చురుగ్గా ఉండే వాడిని గతంలో ప్రధానోపాధ్యాయునికి వ్యతిరేకంగా గా హాస్టల్లో ఉండే సమస్యల పై ఫిర్యాదు చేశాడని అందువల్లే తన సోదరుడిని ఉద్దేశపూర్వకంగా చంపి బావిలో పడేశారు అని ఆరోపించారు. తల్లిదండ్రులు బంధువులు లు తమకు న్యాయం చేయాలంటూ అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు . ఈ ధర్నాలో ప్రజా సంఘాలు పాల్గొన్నాయి . ఈ ఘటనలో ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేస్తూ చేసినట్లు గురుకుల రీజనల్ కోఆర్డినేటర్ ఫ్లోరెన్స్ రాణి వెల్లడించారు. మృతుని కుటుంబంలో ఒక వ్యక్తికి అవుట్సోర్సింగ్ తరఫున ఉద్యోగం ఇస్తామని తెలిపారు. ఈ విషయంపై పోలీసులు ను వివరణ అడగ్గా సీఐ హనుమంతు మాట్లాడుతూ మిస్సింగ్ కేసు నమోదు చేసి అనుమానం వచ్చి బావి వద్ద వెతగ్గా అజయ్ కుమార్ మృతదేహం దొరికిందని వెల్లడించారు . బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని అన్నారు .
byte: మృతుడి సోదరి,
ఫ్లోరెన్స్ రాణి రీజినల్ కోఆర్డినేటర్ గురుకుల పాఠశాల,
మృతుడి అన్న ,
సి ఐ హనుమంతు.


Body:bababanna


Conclusion:gadwal
Last Updated : Dec 19, 2019, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.