విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి విమర్శించారు. జగిత్యాలలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన టీచర్లకు ఆయన సంఘీభావం పలికారు. ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. ఇంతవరకు ఉపాధ్యాయ ఖాళీలు చేపట్టలేదని... తాత్కాలక టీచర్లకూ వేతనాలు చెల్లించలేదన్నారు. సీపీఎస్ రద్దు, ఐఆర్.. వంటి పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని సర్కారును డిమాండ్ చేశారు.
ఇదీ చదవండిః డ్రోన్‌తో దోమలను తరిమారు ఇలా...!