ETV Bharat / state

Telangana Decade Celebrations 2023 : నేడు రాష్ట్రవ్యాప్తంగా 'మంచి నీళ్ల' పండుగ

Good Water Festival Celebrations in Telangana Today : రాష్ట్రవ్యాప్తంగా దశాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 21 రోజుల పాటు జరుగుతున్న తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు మంచి నీళ్ల ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం అధికార యాంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా గడిచిన తొమ్మిదేళ్లలో సాధించిన తెలంగాణ జల ప్రగతి సమాచారంపై ప్రజలకు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు వివరించనున్నారు.

Telangana Decade Celebrations 2023
Telangana Decade Celebrations 2023
author img

By

Published : Jun 18, 2023, 9:19 AM IST

Good Water Celebrations in Decade Celebrations : దశాబ్ది ఉత్సావాల్లో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా మంచి నీళ్ల వేడుకులను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం అధికార యాంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో 'మిషన్​ భగీరథ'తో వచ్చిన మార్పులను ఓసారి గమనిస్తే.. స్వరాష్ట్రంలో తాగునీటి కష్టాలు తీరాయి. మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛ జలాలు వచ్చాయి. నీళ్ల ట్యాంకర్ల వద్ద బిందెడు నీటి కోసం ఆడబిడ్డల సిగపట్లు.. కిలోమీటర్ల దూరం నడిచి వాగులు, వంకల్లో చెలిమలు తవ్వుకొని నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితులు. వ్యవసాయ బావుల వద్ద నీటి కోసం భగీరథ యత్నాలు.. ఇదంతా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రజలు పడిన 'కన్నీటి' కష్టాలు. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి కష్టాలు తొలగించేందుకు కంకణం కట్టుకొన్నారు. భవిష్యత్తు తరాలకు నీటి సమస్యలు రాకూడదని పక్కా ప్రణాళికలు రచించారు. మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారు.

Decade Celebrations In Telangana : పక్కా ప్రణాళికతో ప్రస్తుతం ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు సరఫరా జరుగుతున్నది. నీటి వెతలు తీర్చిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్​కు తెలంగాణ మహిళాలోకం కృతజ్ఞతలు తెలుపుతుంది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన, శుద్ధి చేసిన నీటిని పంపిణీ చేయాలన్న కేసీఆర్ స్వప్నం సాకారమైంది. తెలంగాణలోని 23,839 గ్రామీణ ఆవాసాల్లోని 57.01 లక్షల ఇండ్లు, మున్సిపాలిటీలోల విలీనమైన మరో 649 గ్రామీణ ఆవాసాలు, 121 మున్సిపాలిటీలకు, అడవులు, కొండలపైన ఉన్న 136 గ్రామీణ ఆవాసాలకు మిషన్ భగీరథ స్వచ్ఛ జలాలు సరఫరా అవుతున్నాయి.

Water day In Telangana : మిషన్ భగీరథ నీటితో నల్లగొండ జిల్లాను పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ రక్కసిని తరిమేశారు. ఈ పథకం అమలుకోసం వివిధ ప్రాజెక్టుల నుంచి 59.94 టీఎంసీల నీటిని కేటాయించారు. కృష్ణా బేసిన్ నుంచి 23.44 టీఎంసీలు, ఎల్లంపల్లి హెచ్ఎండబ్ల్యూఎస్ఎల్బీ లైన్ నుంచి 3.92 టీఎంసీలు, గోదావరి బేసిన్ నుంచి 32.58 టీఎంసీల నీటిని మిషన్ భగీరథ పథకానికి కేటాయించారు. ప్రజలకు 100 శాతం సురక్షిత తాగునీటిని అందజేస్తున్న అతిపెద్ద రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే తొలిస్థానంలో నిలవడం విశేషం. మిషన్ భగీరథతో తెలంగాణలోని ప్రజలందరికీ సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్నదని కేంద్ర జల్​శక్తి మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. 2019లో మిషన్ భగీరథ పథకానికి నేషనల్ వాటర్ కమిషన్ అవార్డు కింద ప్రథమ బహుమతి లభించింది.

Water Day In Telangana Decade Celebrations : గ్రామీణ ప్రాంతాలకు నల్లా కనెక్షన్ల ద్వారా నీటిని పంపిణీ చేస్తున్నందుకు జల్ జీవన్ అవార్డ్స్ 2022 కింద ప్రథమ బహుమతి లభించింది. జలమండలి ద్వారా హైదరాబాద్ మహానగరంతో పాటు.. ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు ఉన్న గ్రామాలకు 602 మిలియన్ గ్యాలన్ల నీటి సరఫరా అవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో 688 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉన్న మంచినీటి సరఫరాను తెలంగాణ ప్రభుత్వం 1,456 చదరపు కిలోమీటర్లకు పెంచింది. దాదాపు రూ.1,900 కోట్ల వ్యయంతో 40 లక్షల మందికి తాగునీటి అందించడానికి శివారు మున్సిపాలిటీల్లో 56 రిజర్వాయర్లు, 2,000 కిలోమీటర్ల పైపులైన్ నిర్మిస్తుంది. వీటిలో కొన్ని నిర్మాణం పూర్తయి ప్రారంభం కాగా.. మరికొన్ని చివరి దశలో ఉన్నాయి. రూ.2,000 కోట్ల వ్యయంతో ఔటర్ రింగ్ రోడ్డు రెండు దశల్లో 236 రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు.. 4,000 కిలోమీటర్ల పైపులైను ఏర్పాటవుతుంది. రూ.2,215 కోట్లతో నగరానికి శాశ్వత నీటి పరిష్కారం కోసం సుంకిశాల వద్ద ఇన్టేక్ వెల్ నిర్మిస్తుంది.

Telangana Decade Celebrations 2023 : గత తొమ్మిదేళ్లలో హైదరాబాద్ మహానగర తాగు నీటి వ్యవస్థ కోసం ప్రభుత్వం రూ.7163 కోట్లను ఖర్చు చేసింది. రాష్ట్రంలోని దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న కుటుంబాలకు మిషన్ భగీరథ కింద.. ఒక రూపాయికే నల్లా నీటి కనెక్షన్ ఇచ్చారు. ఇప్పటివరకు ఈ పథకం కింద 53,000 మంది వినియోగదారులు కనెక్షన్లు తీసుకొన్నారు. లబ్ధి దారుల ఎంపిక పారదర్శకంగా ఉండేందుకు థర్డ్ పార్టీ ఆడిట్ సర్వే కూడా చేశారు. దీంతో పాటు 30 వేల మందికి రూ.100 నీటి కనెక్షన్లు ఇచ్చారు. ఈ రెండు కనెక్షన్ల వినియోగదారులకు దాదాపు రూ.25 కోట్లు ప్రభుత్వం భరిస్తుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.