KK Latest Comments: కేంద్రం 40 లక్షల మెట్రిక్ టన్నులే తీసుకుంటే తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుందని తెరాస ఎంపీలు స్పష్టం చేశారు. కేంద్రం బాయిల్డ్ రైస్ అనే పదాన్ని తొలగించాలని ఎంపీ కేకే సూచించారు. కర్షకులు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లేందుకు వీలుగా కేంద్రం కొంత సమయం ఇవ్వాలని కోరారు. ధాన్యం కొనుగోళ్లపై భాజపా నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థకావడం లేదని కేకే మండిపడ్డారు. ప్రతిసారి హుజూరాబాద్ గురించి మాట్లాడం సిగ్గుచేటని విమర్శించారు.
ధాన్యంపై భాజపా నేతలు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావట్లేదు. బాయిల్డ్ రైసు తీసుకునేది లేదని మాకు కేంద్రమంత్రి పీయూశ్ గోయల్ చెప్పారు. వానాకాలంలోనూ 40 లక్షల మెట్రిక్ టన్నులే తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలో దాదాపు కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తోంది. 40 లక్షల మెట్రిక్ టన్నులే తీసుకుంటే రైతులకు అన్యాయం జరుగుతుంది. కేంద్రం బాయిల్డ్ రైసు అనే పదాన్ని తొలగించాలి. వాతావరణం దృష్ట్యా తెలంగాణలో పారా బాయిల్డ్ రైసు మాత్రమే గిట్టుబాటు. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లేందుకు సమయం పడుతుంది. రైతుల్లో అవగాహన పెరిగే వరకైనా బాయిల్డ్ రైసు తీసుకోవాలని కోరాం. భాజపా నేతలు ప్రతిసారి హుజురాబాద్ గురించి మాట్లాడటం సిగ్గుచేటు. అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస గెలిచిన సీట్లు ఎన్ని, భాజపా గెలిచిన స్థానాలు ఎన్ని? ధాన్యం సేకరణపై మా పోరాటం ఆగదు.
-- కేకే, తెరాస ఎంపీ
ఇదీ చూడండి: