ETV Bharat / state

Telangana Congress Bus Yatra 2023 : తిరగబడదాం- తరిమికొడదాం అనే నినాదంతో.. కాంగ్రెస్ బస్సు యాత్ర

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 10, 2023, 7:01 AM IST

Telangana Congress Bus Yatra 2023 : రాష్ట్రంలో ఎన్నికల నగార మోగడంతో.. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వారంలోపే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు.. ప్రచారంపై హస్తం పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. బస్సు యాత్ర ద్వారా.. తిరగబడదాం- తరిమికొడదాం అనే నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లనుంది. ఇవాళ సాయంత్రం జరిగే పీఏసీ సమావేశంలో.. బస్సు యాత్రతోపాటు పార్టీ అగ్రనేతల పర్యటనలు, ప్రచారాలపై చర్చించనున్నారు.

Telangana Assembly Elections 2023
Congress

Telangana Congress Bus Yatra 2023 తిరగబడదాం తరిమికొడదాం నినాదంతో ప్రచారానికి కాంగ్రెస్‌ ప్రణాళికలు

Telangana Congress Bus Yatra 2023 : రాష్ట్రంలో వచ్చే నెల 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. అభ్యర్థుల ఎంపిక కసరత్తును కాంగ్రెస్ మరింత వేగవంతం చేస్తోంది. ఇప్పటికే దాదాపు 105 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. మరో వారంలోపే తొలి జాబితా ప్రకటించేందుకు (Congress MLA Candidates First List) సిద్ధమయ్యారు. కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీనియర్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు తెలుస్తోంది.

Telangana Congress MLA Candidates List Delay : పలు నియోజకవర్గాలలో నిర్వహించిన సర్వేల్లో అగ్రస్థానంలో నిలిచిన నాయకుల పేర్లను జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్న వివాద రహిత నియోజకవర్గాలు దాదాపు 63 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్, సనత్‌నగర్ నుంచి కోట నీలిమ, సికింద్రాబాద్ నుంచి సంతోశ్, ముషీరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, మహేశ్వరం నుంచి పారిజాత నరసింహారెడ్డి, ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్లు ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Telangana Congress Bus Yatra Schedule 2023 : ఈనెల 15 నుంచి తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర

Telangana Congress MLA Tickets Issue : జూబ్లీహిల్స్ నుంచి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, అజారుద్దీన్ రేసులో ఉండడం వల్ల.. ఇద్దరి పేర్లు పరిశీలనకు పెట్టినట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్‌లో డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, కార్పొరేటర్ విజయ రెడ్డి టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎల్బీనగర్ నుంచి మల్‌రెడ్డి రాంరెడ్డి, మధుయాస్కీల పేర్లు పరిశీలనలో ఉంచినట్లు సమాచారం. మిర్యాలగూడ, మునుగోడు, సూర్యాపేట, జనగాం, వరంగల్ ఈస్ట్ వంటి నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.

Congress MLA Candidates List Telangana 2023 : కాంగ్రెస్‌ అభ్యర్థులను ఏఐసీసీ ఇంకా ప్రకటించలేదని మీడియాలో వచ్చే పేర్లను నమ్మి ఎవరూ ఆందోళన చెందవద్దని.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఓ ప్రకటనలో కోరారు. మరోవైపు తిరగబడదాం-తరిమికొడదాం అనే నినాదంతో.. విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు హస్తం పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. ఇవాళ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో విధివిధానాలపై చర్చ జరుగుతుంది.

Telangana Congress MLA Candidates List Delay : కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా మరింత ఆలస్యం.. అప్పటిదాకా ఆగాల్సిందే..!

Telangana Congress Bus Yatra 2023 : అలంపూర్ నుంచి బస్సు యాత్ర (Bus Yatra) ప్రారంభించాలని పీసీసీ భావిస్తోంది. ఏ ఏ పార్లమెంటు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సాగితే తక్కువ సమయంలో ఎక్కువ అసెంబ్లీ సెగ్మెంట్లు చుట్టేయొచ్చనే అంశంపై చర్చ జరగనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడం, అధికారంలోకి వస్తే పార్టీ ఏం చేయనుందో వివరించనున్నారు. ఆరు గ్యారెంటీలు (Six Guarantees), డిక్లరేషన్లను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా కార్యచరణ సిద్ధం చేస్తున్నారు.

ఈనెల 15న బస్సు యాత్రను ప్రారంభించనున్న ప్రియాంక గాంధీ.. రెండు రోజులపాటు పాల్గొంటారు. 18, 19 తేదీల్లో రాహుల్‌ గాంధీ ఈ యాత్రలో పాల్గొంటారు. ఈ సందర్భంలో మేనిఫెస్టోను ఆయన చేతుల మీదుగా విడుదల చేయించాలని పీసీసీ భావిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు కూడా ఇందులో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Congress MLA Candidates List : తెలంగాణ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌.. బలమైన అభ్యర్థుల కోసం వేట..

Telangana Congress MLA Candidates List Delay : గెలుపు గుర్రాల ఎంపికపై నత్తనడకన కాంగ్రెస్.. ఇప్పటికైనా వేగం పెంచి కారుని అధిగమిస్తుందా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.