రేపు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు వెళ్తాం : కిషన్​రెడ్డి

author img

By ETV Bharat Telangana Desk

Published : Nov 3, 2023, 6:29 PM IST

Updated : Nov 3, 2023, 7:58 PM IST

Kishan Reddy Comments on BRS

BJP Plan to Intensify the Election Campaign : కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు శనివారం వెళ్తున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్​రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేసే ప్రణాళికలో భాగంగా హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కిషన్​రెడ్డి అధికార బీఆర్ఎస్​పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మేడిగడ్డ ప్రాజెక్ట్​లో ఉత్పన్నమైన లోపాలను వివరిస్తూ.. కేంద్ర బృందం ప్రతిపాదనలను వెల్లడించారు.

Telangana BJP Plan to Intensify Election Campaign : కాళేశ్వరం ప్రాజెక్టును కమీషన్ల కోసమే కట్టారా అంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పార్టీ ప్రచారాలను ఉద్ధృతం చేసేలా హైదరాబాద్​లో నిర్వహించిన పార్టీ సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి.. మేడిగడ్డ ప్రాజెక్టు(Medigadda Project) వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన వెంటనే కేంద్ర జల్‌శక్తి శాఖకు తానే ఫిర్యాదు చేశానన్నారు.

ప్రజల సొమ్ముతో కడుతున్న ప్రాజెక్టు నాణ్యతను పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించిన కిషన్ రెడ్డి.. తాను ఉత్తరం రాసిన వెంటనే నేషనల్‌ డ్యామ్ సేఫ్టీ అధికారులు స్పందించారని తెలిపారు. కేంద్రం నుంచి వెంటనే ఆరుగురు సభ్యుల బృందం వచ్చి మేడిగడ్డను పరిశీలించినట్లు వివరించారు.

'పనిమంతుడు పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలిందన్నట్లు అయ్యింది'

రాష్ట్రంలో ప్రచారాన్ని ఉద్ధృతం చేసేందుకు హైదరాబాద్‌లో మీడియా సెంటర్‌ను బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్​ఛార్జీ ప్రకాశ్‌ జావడేకర్‌(Prakas jawadekar) ప్రారంభించారు. రాష్ట్రంలోని బీజేపీ అగ్రనేతలంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేసీఆర్ ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకునే కాళేశ్వరం.. నేడు తెలంగాణకు గుదిబండగా మారిందని కిషన్​రెడ్డి ఎద్దేవా చేశారు.

అంతర్జాతీయ స్థాయిలో ప్రాజెక్టు కట్టామని చెప్పిన ప్రభుత్వం.. నేషనల్‌ డ్యామ్ సేఫ్టీ అధికారులు అడిగిన వివరాలు లేవనటం హాస్యాస్పదమన్నారు. కట్టిన నాలుగేళ్లకే పిల్లర్లు కుంగిపోయాయని.. వాటి స్థానంలో కొత్తవి నిర్మించాల్సి ఉందని నిపుణులు చెబుతున్నట్లు బీజేపీ అధ్యక్షుడు వివరించారు. లేదంటే ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమయ్యే అవకాశం ఉందని చెప్పినట్లు తెలిపారు. అయినప్పటికీ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం(State Government) సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందని ఆక్షేపించారు.

రేపు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు వెళ్తాం : కిషన్​రెడ్డి

35 మందితో బీజేపీ మూడో జాబితా విడుదల

కాళేశ్వరం ప్రాజెక్టుపై కొన్ని ప్రాథమిక వివరాలను రాష్ట్ర ప్రభుత్వాన్ని.. డ్యామ్ సేఫ్టీ అధికారులు అడిగారు. కానీ వాటి వివరాలు లేవని చెబుతున్నారు. ఇది ఇంకా నేరంగా భావించాలి. ఎందుకంటే ఇంత భారీ ప్రాజెక్టుకు కనీస ప్రాథమిక వివరాలు లేకపోవడం ఎంతో దయనీయం. ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. రాగానే కాళేశ్వరంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతాం. ఇందుకు ఎవరు బాధ్యులైనా.. ముఖ్యమంత్రి ఉన్నా సరే చట్టపరంగా శిక్షించి తీరుతాం. -కిషన్​రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Kishan Reddy on Kaleshwaram Project : ఇంత జరిగినప్పటికీ సీఎం కేసీఆర్ నోరు మెదపడం లేదని దుయ్యబట్టారు. కేంద్ర బృందం అడిగిన ప్రధానమైన 9 అంశాలపై వివరాలు లేవని అధికారులు చెప్పినట్లు కిషన్​రెడ్డి వివరించారు. ఫౌండేషన్ సరిగా వేయకుండా భారీ ప్రాజెక్టు నిర్మించడం సరికాదన్నారు. ఫౌండేషన్‌ నిర్మాణం బాధ్యతారహితంగా జరిగిందని కేంద్రబృందం తెల్పినట్లు కిషన్ రెడ్డి వివరించారు.

Committee with Six Experts on Medigadda barrage bridge Sagged Incident : 'మేడిగడ్డ' ఘటన.. ఆరుగురు నిపుణులతో కేంద్ర కమిటీ

నాణ్యమైన మెటీరియల్‌ కూడా వాడలేదని డ్యామ్‌ సేఫ్టీ బృందం చెప్పిందని తెలిపిన కిషన్​రెడ్డి.. సీఎం కేసీఆర్‌ సూపర్‌ ఇంజినీర్‌గా మారి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని ఎద్దేవా చేశారు. ఇంజినీర్లను లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినందునే.. ఇవాళ ఈ ఘటన చోటుచేసుకుందని రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్రబృందం అడిగిన వివరాలను రాష్ట్రం ఎందుకు దాచిపెడుతోందని.. తెలంగాణ ప్రజల జీవితాలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని కిషన్​రెడ్డి మండిపడ్డారు.

Last Updated :Nov 3, 2023, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.