ETV Bharat / state

కేసీఆర్ హ్యాట్రిక్​ విన్​కు బ్రేక్ - తెలంగాణలో కారు పంక్చర్ కావడానికి కారణాలేంటి?

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 4, 2023, 6:54 AM IST

Updated : Dec 4, 2023, 7:05 AM IST

Why BRS Lost in Telangana Assembly Elections 2023 : హ్యాట్రిక్ విజయంపై ధీమాతో ఎన్నికల యుద్ధంలోకి దిగిన భారత్ రాష్ట్ర సమితి, అంచనాలు తలకిందులయ్యాయి. ఫలితాల వెల్లడి వరకూ తమదే గెలుపని భావించిన గులాబీ దళానికి చివరకు నిరాశ తప్పలేదు. ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామంటూ 2014లో విజయకేతనం ఎగరవేసిన గులాబీ పార్టీ, బంగారు తెలంగాణ నిర్మాణం కొనసాగాలంటే, సారు, కారు సర్కారు కొనసాగాలంటూ 2018లో గెలిచింది. తొమ్మిదినరేళ్ల అభివృద్ధి నినాదంతో మరోమారు ప్రజల్లోకి వెళ్లిన బీఆర్ఎస్ ప్రచారాన్ని మెజార్టీ ప్రజలు ఆమోదించలేదు. మార్పును కోరుకున్నారు. అసలు ఎందుకిలా జరిగింది?

Telangana Election Result 2023
Why Lost BRS Party in Telangana

కేసీఆర్ హ్యాట్రిక్​ విన్​కు బ్రేక్ - తెలంగాణలో కారు పంక్చర్ కావడానికి కారణాలేంటి?

Why BRS Lost in Telangana Assembly Elections 2023 : మూడోసారి అధికారంలోకి రావాలన్న బీఆర్ఎస్ ఆశలు నెరవేరలేదు. తొమ్మిదిన్నరేళ్ల పాలనపై ప్రజలు మార్పు కోరుకున్నారు. అన్ని పార్టీల కన్నా ముందే ప్రచారాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్, మెజార్టీ ప్రజల మద్దతు కూడగట్టుకోలేక పోయింది. మార్పు కావాలన్న కాంగ్రెస్ నినాదాన్ని ప్రజలు బలపరచడంతో పాటు, పలు వ్యూహాత్మాక తప్పిదాలతో బీఆర్ఎస్ అధికార పీఠాన్ని కోల్పోయింది.

Reason For BRS Loss in Telangana Assembly Elections 2023 : గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన గులాబీ పార్టీ, ఈ సారి అన్ని పార్టీల కన్నా ముందుగా అభ్యర్థులందరినీ ప్రకటించింది. దీంతో అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్, బీజేపీ మరింత అప్రమత్తంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించగలిగాయి. పన్నెండు మంది మినహా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ(Sitting MLA) మళ్లీ టికెట్ ఇవ్వడం కూడా కొంప ముంచింది.

సిట్టింగులపై క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇతర పార్టీల్లో బలహీనతలు, కేసీఆర్​పై విశ్వాసంతో వాటిని అధిగమించవచ్చునన్న గులాబీ పార్టీ అంచనాలు తలకిందులయ్యాయి. సిట్టింగు ఎమ్మెల్యేల్లో పలువురికి ఓటమికి తప్పలేదు. అభ్యర్థులనే కాకుండా ప్రభుత్వాన్ని నడిపే వారి పార్టీని చూడాలని సభల్లో కేసీఆర్ పదేపదే చెప్పినా ఉపయోగపడలేదు.

Telangana Election Results Live 2023 : కేసీఆర్ పాలన సామర్థ్యాన్ని, తొమ్మిదిన్నరేళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓటేయాలన్న బీఆర్ఎస్ ప్రచారం ఈసారి అంతగా పనిచేయలేదనే చెప్పవచ్చు. కుటుంబ పాలన, అహంకార పూరిత వైఖరి అంటూ ప్రత్యర్థులు చేసిన ప్రచారం కొంత వరకు ప్రజల్లోకి వెళ్లడంతో మార్పు కోరుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పలు సందర్భాల్లో కేసీఆర్(KCR), కేటీఆర్​తో పాటు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరు కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపించినట్లు చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలనే కేసీఆర్ కలవరనే ప్రచారం బీఆర్ఎస్​పై నెగెటివ్ టాక్​ను పెంచగలిగింది.

Telangana Assembly Election Results 2023 Live : 33 జిల్లాల్లో సత్తా చాటిన హస్తం అభ్యర్థులు వీళ్లే- ఈ వివరాలు మీకోసం

గ్రూప్ వన్, గ్రూప్ టూ ఇతర నియామక పరీక్షల నిర్వహణలో టీఎస్​పీఎస్సీ(TSPSC) వైఫల్యం బీఆర్ఎస్ మెడకు చుట్టుకుంది. అగ్నికి ఆజ్యం పోసినట్లు వివిధ అంశాలపై యువతలో ఉన్న వ్యతిరేక భావన ప్రశ్నపత్రాల లీకేజీలు మరింత పెంచాయి. కాళేశ్వరం ప్రాజెక్టును ఘనంగా చెప్పుకునే బీఆర్ఎస్​కు మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం పెద్ద ఎదురుదెబ్బ అయింది.

తెలంగాణ ఎన్నికల్లో వారసుల హవా- గెలిచిందెవరు? ఓడిందెవరు?

సరిగ్గా ఎన్నికల సమయంలో మేడిగడ్డ ప్రాజెక్టు దెబ్బతినడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, నాణ్యత లోపమంటూ కాంగ్రెస్, బీజేపీ మరింత గట్టిగా ప్రచారం చేయగలిగాయి. దీంతో అంతకుముందు ఘనంగా చెప్పుకున్న గులాబీ పార్టీ ఎన్నికల ప్రచారంలో కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project) అంశాన్ని ప్రస్తావించలేకపోయింది. కమలం పార్టీ, గులాబీ పార్టీ ఒకటేనంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారం కూడా ప్రజలు కొంతవరకైనా నమ్మి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

BRS Party Defeated in Telangana : ముఖ్యంగా దిల్లీ మద్యం కేసులో కవితను అరెస్టు చేయకపోడం ఈ ప్రచారానికి బలం చేకూర్చినట్లు భావిస్తున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి, తదితర ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీఎల్‌ సంతోష్, అమిత్ షా తదితర బీజేపీ నేతలు కుట్ర చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేసిన కేసీఆర్ ఆ తర్వాత వాటి ఊసే ఎత్తలేదు. తెలంగాణకు టీఆర్​ఎస్​నే శ్రీరామరక్ష అని జాతీయ పార్టీలు(National parties) రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నిక్కచ్చిగా ఉండలేవంటూ గతంలో ప్రచారం చేసిన గులాబీ దళం పార్టీ పేరును బీఆర్ఎస్​గా మార్చడం కూడా కొంత ప్రతికూల ప్రభావం చూపి ఉంటుందని అంచనా.

కేసీఆర్ తెలంగాణను వదిలేసి జాతీయ రాజకీయాలకు వెళ్తారన్న సంకేతాలు కూడా వెళ్లినట్లు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు, తదితర వర్గాల్లో అసంతృప్తి, బీఆర్ఎస్ ఓటమిలో భాగమై ఉండొచ్చునని అంచనా. చంద్రబాబు అరెస్టు, ఆ తర్వాత పరిణామాలపై కేటీఆర్ మాట్లాడిన తీరు సీమాంధ్ర సెటిలర్లు, కమ్మ, కాపు తదితర సామాజిక వర్గాల ఓట్లను కొంత దూరం చేశాయని విశ్లేషకుల అంచనా.

Telangana Election Result 2023 LIVE: కాంగ్రెస్​కు కలిసొచ్చిన వారసత్వ రాజకీయం - విజయతీరాలకు ఆ కుటుంబాలు

దీనికి తోడు ఏపీలో జగన్ ప్రభుత్వానికి మద్దుతుగా బీఆర్ఎస్ ఉందన్న ప్రచారం కూడా కొన్ని వర్గాలను దూరం చేసింది. గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్, టీడీపీ శాసనసభ పక్షాలనే విలీనం చేసుకోవడంతో బీఆర్ఎస్ పట్ల కొంత నెగెటివ్ ఆలోచనలను(Negative Thoughts) పెంచినట్లు తెలుస్తోంది. దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి, డబుల్ బెడ్ రూం ఇళ్లు వంటి పథకాల్లో కొందరికి లబ్ధి కలిగినప్పటికీ, చాలా మందికి అందకపోవడం కూడా బీఆర్ఎస్​కు నష్టమే కలిగించినట్లు తెలుస్తోంది. ధరణి వల్ల భూమిపై హక్కులు కోల్పోయమనే నిరసనలు, విపక్షాల విమర్శలు ప్రభుత్వాన్ని ప్రతిష్ఠను దెబ్బతీశాయని విశ్లేషణలు ఉన్నాయి.

టికెట్లు ప్రకటించగానే పెల్లుబికిన అసమ్మతి, అసంతృప్తిని బీఆర్ఎస్ చల్లార్చలేక పోయింది. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు కూడా పార్టీని వీడి వెళ్లిపోయారు. గులాబీ పార్టీ మేనిఫెస్టో కూడా అంతగా ఆకర్షించలేక పోయింది. కేసీఆర్ భరోసా(KCR Assurance) పేరుతో ప్రచారం చేసినప్పటికీ, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల స్థాయిలో ప్రజలకు చేరలేదు.

పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్​కు అనుకూల ప్రచారం పెరగ్గా ,దాన్ని కౌంటర్ చేయడంలో బీఆర్ఎస్ విఫలమైంది. రాష్ట్రవ్యాప్తంగా 96 ప్రజాఆశీర్వాద సభలు నిర్వహించినప్పటికీ కేసీఆర్ ప్రసంగాలు ప్రజలు అంచనాలకు విధంగా ఆకట్టుకోలేక పోయాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Nalgonda, Telangana Election Results 2023 Live : ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హ‌వా - సూర్యాపేట మాత్రం జగదీశ్​రెడ్డిదే

Kamareddy, Telangana Elections Result 2023 Live : కామారెడ్డి షాకింగ్ రిజల్ట్ - రేవంత్‌, కేసీఆర్​ నెట్టేసి గెలిచిన వెంకటరమణ

Last Updated : Dec 4, 2023, 7:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.